AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadi Movie: ఆది సినిమాలో ఎన్టీఆర్ జోడిగా ఆ హీరోయిన్ చేయాల్సింది.. తనని వెళ్లి అడిగితే ఏం జరిగిందంటే.. డైరెక్టర్ వివి వినాయక్..

దర్శకుడు వి.వి. వినాయక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నారు. స్టార్ హీరోలతో విభిన్నమైన కంటెంట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆది సినిమా నిర్మాణ విశేషాలను పంచుకున్నారు. సాఫ్ట్ సినిమాల నుంచి మాస్ జోనర్‌లోకి తన ప్రయాణం, ఆది సినిమాకు దారితీసిన పరిస్థితులను వివరించారు.

Aadi Movie: ఆది సినిమాలో ఎన్టీఆర్ జోడిగా ఆ హీరోయిన్ చేయాల్సింది.. తనని వెళ్లి అడిగితే ఏం జరిగిందంటే.. డైరెక్టర్ వివి వినాయక్..
Aadi Movie
Rajitha Chanti
|

Updated on: Mar 26, 2026 | 4:52 PM

Share

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో వి.వి.వినాయక్ ఒకరు. స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. చాలా రోజులుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు వి.వి. వినాయక్ ఆది సినిమా నిర్మాణ విశేషాలు, నటీనటుల ఎంపిక, ముఖ్యమైన సన్నివేశాల గురించి మాట్లాడారు. తాను సాఫ్ట్ డైరెక్టర్లైన ఎస్.వి. కృష్ణారెడ్డి, ఇ.వి.వి. సత్యనారాయణ వద్ద పని చేసినప్పటికీ, తన సినిమాలన్నీ మాస్ జోనర్‌లో ఉండటంపై వచ్చిన ప్రశ్నకు వినాయక్ స్పందిస్తూ, చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి నేర్చుకున్నదేనని, ఆ రోజుల్లో తనకు మాస్ సినిమా కావాలని అడిగారని తెలిపారు. ఒక్కసారి ఆ బ్రాకెట్‌లో విజయం సాధించిన తర్వాత అందరూ అదే తరహా సినిమాను ఆశించారని పేర్కొన్నారు. ఆది సినిమా షూటింగ్ సమయంలో రాయలసీమ ప్రాంతంలో ప్రేక్షకుల స్పందన గురించి వినాయక్ గుర్తుచేసుకున్నారు. సాంబ, కొండారెడ్డి బురుజు ప్రాంతాల్లో షూటింగ్ జరిపినప్పుడు స్థానిక ప్రజల అభిమానాన్ని పొందామని చెప్పారు. ఆది సినిమాలోని సుమోల బ్లాస్ట్, చిన్న పిల్లాడు తొడగొట్టే సీన్‌, ఎన్టీఆర్ తొడగొట్టే సన్నివేశం, బావి దగ్గర నీళ్లు తాగే సీన్‌ వంటివి తనకే అత్యంత ఇష్టమైనవిగా వినాయక్ పేర్కొన్నారు. విలన్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చి సుమోలు ఎగిరే సీన్‌, చిన్న పిల్లాడు బాంబు వేసే సీన్‌ – ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని కథ రాశానని ఆయన వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Sri Sri: ఆ హీరో నా ప్రతి అక్షరానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చారు.. శ్రీశ్రీ కామెంట్స్ వైరల్..

చలపతిరావుని ఆది సినిమాలో బాబాయ్ పాత్రకు ఎలా ఎంచుకున్నారో వినాయక్ వివరించారు. అంతకు ముందు ఏ సినిమాలోనూ ఆ పాత్ర చేయని చలపతిరావుకు తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే తెలుసని, ఆయన ఈ పాత్రకు సరైన వ్యక్తి అని భావించానని చెప్పారు. తొలి రోజు షూటింగ్ సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన చలపతిరావు, తాను వివరించిన ఒక సీన్‌కు పూర్తిగా లీనమైపోయారని, తనతో పని చేస్తూనే కథపై ఆసక్తి చూపించి, ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌లా వ్యవహరించారని వినాయక్ గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి తన అన్ని సినిమాల్లో చలపతిరావు భాగమయ్యారని తెలిపారు. కేవలం 50 రోజుల్లో ఆది సినిమాను పూర్తి చేశామని, అది 175 రోజుల పాటు ఆడిందని వినాయక్ పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Monalisa : నన్ను ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.. శారీరకంగా వేధించాడు.. మోనాలిసా సంచలన కామెంట్స్..

హీరోయిన్ ఎంపిక ప్రక్రియ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అప్పట్లో కొత్త హీరో అని, అందువల్ల పెద్ద హీరోయిన్లు సరిపోరని అన్నారు. ఆది కోసం మొదట ఆర్తి అగర్వాల్‌ను అనుకున్నారని, పాగల్‌పన్ సినిమా పోస్టర్‌లు చూసి ఆమెను ఎంపిక చేయాలని భావించారని వినాయక్ తెలిపారు. అయితే, ఆమె అప్పటికే వెంకటేష్ సినిమాకు అంగీకరించి ఉండటంతో, అది కుదరలేదని చెప్పారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో ఛార్మిని చూసి సంప్రదించినా, చివరకు నల్లమలపు బుజ్జి సూచనతో కీర్తి చావ్లాను ఎంపిక చేశామని వినాయక్ వెల్లడించారు. ఎన్టీఆర్ అప్పట్లో బాగా ఫుడ్డీ అని, డైటింగ్ పాలసీలు లేవని, కేకులు, స్వీట్లు, బిర్యానీలు బాగా తినేవారని, రాఖీ సినిమా వరకు అలాగే ఉన్నా, యమదొంగ సినిమాతో పూర్తిగా మారిపోయారని వినాయక్ వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma: ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన గొప్ప వ్యక్తి.. రామ్ గోపాల్ వర్మ..

Aarthi Agarwal

Aarthi Agarwal

ఎక్కువ మంది చదివినవి : Tollywood: కోటి 40 లక్షలు పెట్టి సినిమా తీశా.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగాను.. టాలీవుడ్ నటుడు..

Follow Us