శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామ రహదారిపై ఎలుగుబంటి సంచారం స్థానికులను కలవరపెట్టింది. పనులకు వెళ్తున్న 10 మంది కూలీలు ఆటోలో వెళ్తుండగా రోడ్డుపై ఎలుగుబంటిని చూసి భయంతో కేకలు వేశారు. ఎలుగుబంటిని పట్టుకుని తిరిగి అడవిలోకి పంపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో సరిహద్దు గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.