తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరంలో ఒక కుటుంబం తమ పెంపుడు ఆవుకు ఘనంగా సీమంతం నిర్వహించింది. లక్ష్మీ అని పేరు పెట్టి కన్నబిడ్డలా పెంచుకున్న ఆవు గర్భం దాల్చగా, పురోహితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. జంతువులపై వారికున్న అపారమైన ప్రేమకు ఇది నిదర్శనం.