సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప
సాగర్ నగర్ తీరంలో మత్స్యకారుల వలకు రెండు అరుదైన సముద్ర జీవులు చిక్కాయి. సాధారణంగా లోతైన సముద్రంలో నివసించే ముళ్ల భవిరి చేప (ట్రైపాడ్ ఫిష్) మూడు కాళ్లపై నిలబడినట్లు నిశ్చలంగా ఉంటుంది. గాలిపటం ఆకారంలో తెల్లటి చుక్కలతో ఉండే చుక్కల టేకు చేప (స్పాటెడ్ ఈగల్ రే) చూపరులను ఆకట్టుకుంది. ఈ వింత జీవులను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.
సముద్ర గర్భంలో రకరకాల జీవులు నివసిస్తాయి. అప్పుడప్పుడూ అవి తీరానికి చేరి ప్రజలను ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా సాగర్ నగర్ తీరంలో మత్స్యకారుల వలకు చిక్కిన రెండు అరుదైన జీవులు చూపరులను ఆకట్టుకున్నాయి. సాధారణంగా సముద్రపు అట్టడుగున నివసించే ‘ట్రైపాడ్ ఫిష్’ దీనినే ముళ్ల భవిరి చేప అంటారు, అలాగే గాలిపటం ఆకారంలో ఉండే ‘స్పాటెడ్ ఈగల్ రే’ దీనిని చుక్కల టేకు చేప అంటారు. ఈ రెండు ఇంత చేపలు మత్స్యకారుల వలకు చిక్కాయి. ముళ్లభవిరి చేపను చూస్తే ప్రకృతి సృజనకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది నీటిలో ఈదడమే కాదు, సముద్రపు అడుగున మూడు కాళ్ల స్టాండ్ మీద నిలబడినట్లు నిశ్చలంగా నిలుచుంటుంది. దీని కడుపు కింది భాగంలో ఉండే పొడవాటి రెక్కలు బలమైన ముళ్లతో కూడి, కాళ్లలా పనిచేస్తాయి. అందుకే దీనికి ‘ట్రైపాడ్ ఫిష్’ అనే పేరు వచ్చింది. సుమారు 30 సెంటీమీటర్ల వరకు పెరిగే ఈ చేప, తన కాళ్ల సాయంతో నిలబడి నీటిలోని ప్రకంపనల ద్వారా ఆహారాన్ని పసిగట్టి వేటాడుతుంది. మరోవైపు నల్లటి శరీరంతో, తెల్లటి చుక్కలు కలిగి గాలిపటంలా మెరిసిపోతున్న ‘స్పాటెడ్ ఈగల్ రే చేప అందరినీ ఆకర్షించింది. ఇది నీటిలో ఈదుతుంటే పక్షి గాలిలో ఎగురుతున్నట్లే ఉంటుంది. శత్రువుల నుండి రక్షణ కోసం దీనికి పొడవాటి తోక ఉంటుంది. సాధారణంగా సముద్రపు లోతైన ప్రాంతాల్లో ఉండే ఈ అరుదైన జీవులు తీర ప్రాంతంలో కనిపించడం అరుదని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ వింత చేపలను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇన్‌స్టా, FB అడిక్షన్.. ఆ యువతిలో మానసిక సమస్యలు!
MS Dhoni: ధోనీకి ఇష్టమైన పాట ఇదేనట..స్వయంగా వెల్లడించిన ఏఆర్ రెహమాన్!
పోయిన బంగారంతో వస్తేనే ఇంట్లోకి రానిస్తా
మహిమల చెంబు.. మీ ఇంట ఉంటే సిరుల పంటే.. ఆలసించిన ఆశాభంగం
క్యాన్సర్‌ను ఎదిరించి.. CBSE టెన్త్‌లో టాపర్‌గా నిలిచి..
రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్ ప్లాన్ అదిరిందిగా
ఒక్కరోజు వయసున్న క్యూట్ 'రైనో'.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో
ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా
పెట్రోల్ బంకుల్లో ఎయిర్ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్

