బంపర్ ఆఫర్.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!
దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటల్ పరిశ్రమ సతమతమవుతోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమిళనాడులోని హోసూరులో ఓ హోటల్ వినూత్న ఆఫర్ ప్రకటించింది: ఒక వాణిజ్య సిలిండర్ ఇస్తే, నెలరోజులు ఉచిత బిర్యానీ. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆరుగురు సిలిండర్లు ఇచ్చినా, ఎవరూ నాలుగు రోజులకు మించి బిర్యానీ తీసుకోకపోవడం ఆశ్చర్యం.
దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత హోటల్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమిళనాడులోని హోసూరులో ఓ హోటల్ వినూత్నమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఒక వాణిజ్య సిలిండర్ ఇస్తే, నెల రోజుల పాటు ప్రతిరోజూ ఉచితంగా బిర్యానీ అందిస్తామని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హోసూరులోని తళి రోడ్డులో ఉన్న ఓ హోటల్ నిర్వాహకులు ఎల్పీజీ సిలెండర్ కోసం ఈ వినూత్న ఆఫర్ ప్రవేశపెట్టారు. ఎవరైనా తమకు ఒక పూర్తి స్థాయి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ఇస్తే, వారికి నెల రోజుల పాటు ప్రతిరోజూ ఉచితంగా చికెన్ లేదా మటన్ బిర్యానీ అందిస్తామని ప్రకటించింది. సిలిండర్ ఇచ్చిన వెంటనే, దానికి బదులుగా అదే కంపెనీకి చెందిన ఖాళీ సిలిండర్‌ను కస్టమర్‌కు తిరిగి ఇచ్చేస్తామని బోర్డు పెట్టారు. గ్యాస్ కొరతతో హోటల్‌ను మూసివేయాలని భావించిన సమయంలో, ఒక పాత కస్టమర్ ఇచ్చిన సలహా మేరకు ఈ ఆఫర్‌ను ప్రారంభించినట్లు హోటల్ మేనేజర్ అశోక్ తెలిపారు. ఈ ఆఫర్‌కు అనూహ్య స్పందన వస్తోందని, గత 15 రోజుల్లో ఆరుగురు కస్టమర్లు సిలిండర్లు తెచ్చి ఇచ్చారని ఆయన వెల్లడించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సిలిండర్ ఇచ్చిన వారు ఎవరూ కూడా వరుసగా నాలుగు రోజులకు మించి బిర్యానీ తినడానికి రాలేదని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా కళ్లు జిగేల్
పాడేరులో అద్భుతం ‘మినీ కాశ్మీర్’గా మారిన అరకు లోయ
AC Price: భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ప్రధాన కారణాలు ఇవే
వైరల్ కోతికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది.. కొత్త స్నేహం, కొత్త జీవితం
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!
బాత్రూమ్లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..
సహారాలోనూ తప్పని ఆన్లైన్ మీటింగ్! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..
ఏంటి ఈ సరికొత్త ఆన్లైన్ షాపింగ్ విధానం?
ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!

