పాడేరులో అద్భుతం ‘మినీ కాశ్మీర్’గా మారిన అరకు లోయ
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్న వేళ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో ఊహించని విధంగా భారీ వడగళ్ల వాన కురిసింది. సుమారు 20 నిమిషాల పాటు కురిసిన ఈ వాన అరకు ఘాట్ రోడ్, మాడగడ ప్రాంతాలను మంచు దుప్పటితో కప్పేసింది. స్థానికులు మొదట ఆందోళన చెందినా, వర్షం తగ్గాక వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. పర్యాటకులు మంచు ముక్కలతో ఆటలాడుతూ, ఫోటోలు దిగుతూ వేసవి తాపం నుండి అనూహ్య ఉపశమనం పొందారు, 'కాశ్మీర్‌లో ఉన్నామా?' అని ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎండలు మండిపోతుంటే, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వాన కురిసింది. సుమారు 20 నిమిషాల పాటు నిర్విరామంగా కురిసిన ఈ వడగళ్ల వానతో అరకు ఘాట్ రోడ్, మాడగడ, అరకులోయ ప్రాంతాలన్నీ మంచు ముక్కలతో నిండిపోయాయి. వడగళ్లు పడుతున్న సమయంలో రేకు షెడ్లపై భారీ శబ్దాలు వినిపించాయి. ఆకాశం నుండి ఎవరో రాళ్లతో కొడుతున్నట్టుగా మంచు ముక్కలు పడటంతో స్థానికులు కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే, వర్షం తగ్గిన తర్వాత పరిసరాలన్నీ తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్నట్టుగా మారిపోయాయి. వేసవి తాపం నుండి ఉపశమనం కోసం రిసార్ట్స్‌కు వచ్చిన పర్యాటకులకు ఈ వాతావరణం ఊహించని అనుభూతిని అందించింది. బయటకు వచ్చి కుప్పలుగా పేరుకుపోయిన మంచు ముక్కలతో సందడి చేశారు. ఒకరిపై ఒకరు మంచు విసురుకుంటూ, ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేశారు. తాము ఆంధ్రాలో ఉన్నామా లేక కాశ్మీర్‌లో ఉన్నామా?” అనేంతగా వాతావరణం ఆహ్లాదకరంగా మారిందని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AC Price: భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ప్రధాన కారణాలు ఇవే
వైరల్ కోతికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది.. కొత్త స్నేహం, కొత్త జీవితం
సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప
ఇన్‌స్టా, FB అడిక్షన్.. ఆ యువతిలో మానసిక సమస్యలు!
MS Dhoni: ధోనీకి ఇష్టమైన పాట ఇదేనట..స్వయంగా వెల్లడించిన ఏఆర్ రెహమాన్!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

