రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా కళ్లు జిగేల్
మెదక్ జిల్లా తూప్రాన్ లో ఇద్దరు టీ స్టాల్ నిర్వాహకులు, నాగరాజు, కృష్ణలకు తొమ్మిది తులాల బంగారు నగలు దొరికాయి. ఆశకు లోనుకాకుండా, వారు వెంటనే వాటిని పోలీసులకు అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు. వారి మానవతా దృక్పథాన్ని మెచ్చుకుంటూ పోలీసులు సన్మానించారు. ప్రస్తుత సమాజంలో ఇలాంటి నిజాయితీపరులు ఉండడం గర్వకారణం, మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు.
ఆశ పుట్టించే వస్తువు పక్కనే ఉన్నా.. ఆత్మసాక్షిని చంపుకోలేదు. ప్రస్తుతకాలంలో రూపాయి దొరికితేనే జేబులో వేసుకునే మనుషుల మధ్య, ఏకంగా తొమ్మిది తులాల బంగారు నగలు దొరికినా వాటిపై ఆశపడకుండా పోలీసులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు ఇద్దరు వ్యక్తులు. మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అల్లాపూర్ గ్రామానికి చెందిన నర్సింలు అనే వ్యక్తి తన కూతురికి చెందిన తొమ్మిది తులాల బంగారు నగలను ఒక బ్యాగులో పెట్టుకుని బైక్‌పై దొంతి గ్రామానికి బయలుదేరారు. అయితే, ప్రయాణంలో బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆ నగలున్న బ్యాగ్ ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది. ఆ విషయాన్ని గమనించని నర్సింలు అలాగే ముందుకు వెళ్లిపోయారు. అదే దారిలో వెళ్తున్న టీ స్టాల్ నిర్వాహకులు నాగరాజు, కృష్ణలకు ఈ బ్యాగ్ దొరికింది. బ్యాగ్ తెరిచి చూడగా అందులో భారీగా బంగారు నగలు కనిపించాయి. వాటిని చూడగానే మొదట వారు షాకయ్యారు. తేరుకొని ఏ బిడ్డ పెండ్లికోసం తండ్రి చేయించిన నగలో పాపం పడిపోయాయి..అని భావించిన నాగరాజు, కృష్ణ వెంటనే నగల బ్యాగును తీసుకొని నేరుగా తూప్రాన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని, పోలీసులకు నగల బ్యాగును భద్రంగా అప్పగించారు. విషయం తెలుసుకున్న తూప్రాన్ డిఎస్పీ, ఆ ఇద్దరు వ్యక్తుల నిజాయితీని చూసి ముగ్ధులయ్యారు. నగలను బాధితుడికి అందజేయడమే కాకుండా, నాగరాజు మరియు కృష్ణలను పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు. “సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నంత కాలం మానవత్వం బతికే ఉంటుంది” అని ఈ సందర్భంగా అధికారులు కొనియాడారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాడేరులో అద్భుతం ‘మినీ కాశ్మీర్’గా మారిన అరకు లోయ
AC Price: భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ప్రధాన కారణాలు ఇవే
వైరల్ కోతికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది.. కొత్త స్నేహం, కొత్త జీవితం
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

