AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తన కన్నా ముందే తన కొడుకు చనిపోవాలని కోరుకున్న స్టార్ నటుడు.. ఎవరు? ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

ఏ తండ్రైనా తమ పిల్లలు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఈ టాలీవుడ్ నటుడు మాత్రం మాత్రం తన కొడుకు తన కంటే ముందే చనిపోవాలని దేవుడిని ప్రార్థించాడు. చివరకు ఆయన కోరుకున్నదే జరిగింది. ఈ నటుడి కంటే ముందే ఆయన కుమారుడు చనిపోయాడు.

Tollywood: తన కన్నా ముందే తన కొడుకు చనిపోవాలని కోరుకున్న స్టార్ నటుడు.. ఎవరు? ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు
Tollywood Actor
Basha Shek
|

Updated on: Mar 29, 2026 | 1:05 PM

Share

ప్రసాద్ బాబు.. ఈతరం ఆడియెన్స్‌ కు ఈ నటుడి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90వ దశకం సినీ ప్రియులకు ఈ నటుడు బాగా సుపరిచితమే. కెరీర్ ప్రారంభంలో హీరోగా రాణించిన ఈ నటుడు ఆ తర్వాత విలన్ గా, కమెడియన్ గా, సహాయక నటుడిగానూ మెప్పించాడు. దాదాపు 1500 సినిమాల్లో నటించి మెప్పించిన ఈ నటుడు దర్శకుడిగానూ సినిమాలు తీశారు. అలాగే పలు సూపర్ హిట్ సీరియల్స్‌లో కూడా యాక్ట్ చేశారు. ‘నిన్నే పెళ్లాడతా’, జయం’, ‘చిన్న కోడలు’, ‘రాములమ్మ’ తదితర సీరియల్స్ తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు ప్రసాద్ బాబు. 75 ఏళ్ల వయసులోనూ ఈ నటుడు చురుగ్గా ఉంటూ సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే గతంలో ఒక ఇంటర్వ్యూకు హాజరైన ప్రసాద్ బాబు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అదే క్రమంలో తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత విషాదకరమైన సంఘటనను పంచుకుని అందరినీ కన్నీరు పెట్టించారు.

ప్రసాద్ బాబు పెద్ద కుమారుడు పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. మాటలు కూడా రావు. తాను మేనరికం వివాహం చేసుకోవడం వల్లే తన కొడుకు ఇలా పుట్టాడని ప్రసాద్ బాబు బాధపడుతుంటాడు. కుమారుడి పరిస్థితి బాగా లేకపోయినా తన ప్రతి సినిమా షూటింగ్‌కు తనతో పాటే తీసుకెళ్లేవారట. అలాగే తన కొడుకుని ఒక మంచి కళాకారుడిగా చూడాలని ఆయన అనుకున్నారట. ఆ క్రమంలోనే డైరెక్టర్ గా మారి ‘సాహస బాలలు’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు బంగారు నంది అవార్డు కూడా వచ్చింది. అయితే ఒక రోజు ప్రసాద్ బాబు కుమారుడు వేసవి కాలంలో క్రికెట్ ఆడుతుండగా వడదెబ్బ తగిలింది. దీంతో గ్రౌండ్‌లోనే గుండెపోటు తో కుప్పకూలిపోయాడు. ఈ దుర్వార్త వినగానే ప్రసాద్ బాబు తండ్రిగా కుమిలిపోయాడట.. అదే సమంయలో ఒక పెద్ద భయం నుంచి విముక్తి లభించిందని దేవుడికి ధన్యవాదాలు చెప్పారట.

‘నేను బతికున్నంత కాలం నా కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటాను. కానీ, రేపు నేను చనిపోయాక వాడిని ఎవరు చూస్తారు? ఎవరైనా సరిగ్గా నా బిడ్డకు తిండి పెడతారా? వాడిని సరిగ్గా చూసుకుంటారా?” అనే ఆలోచనలు నన్ను నిద్రపోనిచ్చేవి కాదు. ఒక అనాథలా నా కుమారుడు బతకకూడదన్న ఉద్దేశంతోనే కొడుకు నా కంటే ముందే చనిపోవాలని మనసులో కోరుకున్నాను’ అంటూ ఎమోషనల్ అయ్యారు ప్రసాద్ బాబు.

ఇవి కూడా చదవండి
Prasad Babu

Prasad Babu

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us