AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Loss: జుట్టు విపరీతంగా ఊడి పోతుందా? లైట్‌ తీసుకోకండి.. దేనికి సంకేతమో తెలుసా

నేటి కాలంలో జుట్టు రాలడం అనే సమస్య సాధారణమై పోయింది. ప్రతిరోజూ సుమారు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సాధారణమే. కానీ ఇంతకంటే ఎక్కువగా జుట్టు రాలుస్తుంటే, జుట్టు దువ్వితే మీ పిడికిలి కంటే ఎక్కువగా జుట్టు రాలుతుంటే, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది శరీరంలోని అంతర్గత ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చు. కాబట్టి ఇలా జరిగినప్పుడు ఏం చేయాలి, ఇది ఏ ఆరోగ్య సమస్యకు సంకేతమో ఇక్కడ తెలుసుకుందాం..

Srilakshmi C
|

Updated on: Mar 29, 2026 | 12:30 PM

Share

1 / 5
చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ సౌమ్య సచ్‌దేవా ప్రకారం.. ముఖ్యంగా మహిళల్లో అధికంగా జుట్టు రాలడానికి అనేక ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చు. థైరాయిడ్ సమస్య ఉంటే, శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరిచి, జుట్టు త్వరగా రాలిపోయే అవకాశాలను పెంచుతుంది. అంతేకాకుండా శరీరంలో ఐరన్ లోపం లేదా రక్తహీనత ఉంటే, జుట్టుకు అవసరమైన పోషకాలు అందవు.

2 / 5
జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంటే.. హార్మోన్ల అసమతుల్యత, PCOS కారణం కావచ్చు. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి దారితీయవచ్చు. హార్మోన్ల అసమతుల్యత, ఐరన్‌, ప్రోటీన్ లోపాలు ఉన్నవారు, అధిక ఒత్తిడికి గురయ్యేవారికి జుట్టు రాలడం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.

3 / 5
అంతేకాకుండా రసాయనాలు అధికంగా ఉన్న జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం, తరచుగా హెయిర్ స్టైలింగ్ చేసుకోవడం, జుట్టును మరీ గట్టిగా కట్టడం వంటివి కూడా జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తాయి.

4 / 5
జుట్టు రాలడాన్ని నివారించడానికి సమతుల్యమైన, పోషకమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా ఐరన్‌, ప్రోటీన్, విటమిన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్రపోవడం, జుట్టును సరిగ్గా సంరక్షించుకోవడం వంటివి చేయాలి. జుట్టు రాలడం ఎక్కువ కాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

5 / 5
Follow Us