ఆ హీరో అంటే పిచ్చి ఇష్టం.. ఎలాగైనా అతడితో కలిసి నటించాలని ఉంది..

Rajitha Chanti

Pic credit - Instagram

29 March 2026

పాన్ ఇండియా లెవల్లో అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో నటించి మెప్పించింది.

బాలనటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

అందం, అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది. ఆ తర్వాత వెంటనే మహానటి సినిమాతో ఒక్కసారిగా విమర్శకుల ప్రశంసలు అందుకుని ఈ అమ్మడు. 

తెలుగులో స్టా్ర్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ అక్కడే బిజీగా ఉంది. 

నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగానూ రాణించింది కీర్తి సురేష్. గతంలో ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా తనకు నచ్చిన హీరో గురించి రివీల్ చేసింది కీర్తి.

తనకు కోలీవుడ్ హీరో శింబు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అతడితో కలిసి ఎలాగైనా సినిమా చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది కీర్తి.

అతడంటే తనకు చాలా ఇష్టమని.. శింబుకు మంచి ఫ్యాన్ బేస్ ఉందని.. ఇప్పటికే ఒకటి రెండు సార్లు తనతో ఫోన్ కాల్ మాట్లాడనని అన్నారు.

కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరోవైపు నెట్టింట గ్లామర్ ఫోటోషూట్లతో తెగ సందడి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.