రామ్ చరణ్ మొబైల్ వాల్ పేపర్‌గా ఎవరి ఫొటో ఉంటుందో తెలుసా? అసలు ఊహించలేరు
28 March 2026
Basha Shek
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు (మార్చి 27) వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల, నెటిజన్లు చెర్రీకి బర్త్ డే విషెస్ చెప్పారు.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ కు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రామ్ చరణ్. చిరుత సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత మగధీర, రచ్చ, నాయక్, ఎవడు, రంగస్థలం, ధ్రువ, ఆర్ఆర్ఆర్ సినిమాలతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు మన మెగా పవర్ స్టార్.
మెగాస్టార్ చిరంజీవి లాగే రామ్ చరణ్ కూడా ఆంజనేయేని భక్తుడు. ఈ విషయాన్ని అతనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
అందుకే తన ఇష్ట దైవమైన హనుమంతుడి ఫొటోనే తన మొబైల్ ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకున్నాడు రామ్ చరణ్. ఈ విషయం పలు సందర్భాల్లో రుజువైంది.
ఇక రామ్ చరణ్ పేరుకు కూడా ఓ అర్థం ఉంది. . శ్రీరాముడి చరణాల వద్ద ఉండేవాడు ఆంజనేయుడు.. కాబట్టి తన కుమారుడికి రామ్ చరణ్ అని పేరు పెట్టారు చిరంజీవి
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.