AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2: నోట్ల రద్దు ఇబ్బందులు మర్చిపోయారా? ‘ధురంధర్ 2’ పై విమర్శలు గుప్పించిన స్టార్ డైరెక్టర్.. వీడియో

సామాన్యులతో పాటు చాలా మంది సెలబ్రిటీలు 'ధురందర్ 2' సినిమాను చూసి ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో మరికొందరు ఈ సినిమాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా సినిమా ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఓ ప్రముఖ దర్శకుడు కూడా 'ధురందర్ 2' పై తీవ్ర విమర్శలు గుప్పించాడు.

Dhurandhar 2: నోట్ల రద్దు ఇబ్బందులు మర్చిపోయారా? 'ధురంధర్ 2' పై విమర్శలు గుప్పించిన స్టార్ డైరెక్టర్.. వీడియో
Dhurandhar The Revenge
Basha Shek
|

Updated on: Mar 29, 2026 | 11:44 AM

Share

శ్రీలంక అంతర్యుద్ధం  ఆధారంగా రూపొందిన చిత్రం ‘నీలిర’. ఈ సినిమా ట్రైలర్ రిలీజే ఈవెంట్ కు ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన చిత్ర పరిశ్రమలో విద్వేషపూరిత చిత్రాలు పెరుగుతున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశాయి. వెట్రిమారన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీశాయి . ఆయన నేరు గా ప్రస్తావించకపోయినా ఆదిత్య ధర్, రణవీర్ సింగ్‌ల చిత్రం ‘ధురందర్ 2’ను లక్ష్యంగా చేసుకునే ఈ కామెంట్స్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు . ‘మనం మన కథలను చెప్పుకునేంత వరకు, మన శత్రువులు చెప్పిందే మన జీవితం. మన సొంత కథలను చెప్పుకోవడానికి మనకు ప్రజాస్వామ్యం లేదు. ఈ చిత్రం ద్వేషాన్ని ప్రొత్సహించదు. హింసను సమర్థించదు. రూ. వందల కోట్లు సంపాదించాలనే ఆశతో కొంతమంది హింసను ప్రేరేపించేలా సినిమాలను నిర్మిస్తున్నారు. కానీ ఈ చిత్రం (నీలిర) ఒక జాతిని, ఒక మతాన్ని కానీ అపహాస్యం చేసేలా తెరకెక్కలేదు’ . ఈ రోజుల్లో ప్రతీది ఒక ప్రచారంగా మారిపోయింది. మన జ్ఞాపకాలను, ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఈ ప్రచారానికి ఉంది. నోట్ల రద్దు వల్ల ఎవరు నష్టపోయారో, క్యూ లైన్లలో నిలబడి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వాటన్నింటినీ మరుగున పడేసి, ద్వేషాన్ని పెంచేలా ప్రచారం చేస్తున్నారు. అది సినిమానే కాదు. చరిత్రను లేదా వాస్తవాలను వక్రీకరించి చూపడం ‘హేట్ ప్రొపగండా’కిందకే వస్తుంది’ అని వెట్రిమారన్ చెప్పుకొచ్చారు.

కాగా ‘ధురందర్ 2’ సినిమా ఉగ్రవాదాన్ని నివారించడానికి, నకిలీ నోట్ల వ్యాప్తిని అరికట్టడానికి ఒక మార్గంగా నోట్ల రద్దును చూపించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది దీనిని సమర్థిస్తుంటే మరికొందరు తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధురందర్ 2 సినిమా గురించి వెట్రిమారన్ మాట్లాడారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక ‘నీలిర’ సినిమా గురించి మాట్లాడిన వెట్రి మారన్.. ‘ ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ శ్రీలంక అంతర్యుద్ధం కథను ఎంచుకున్న ‘నీలిర’ బృందాన్ని ఆయన ప్రశంసించారు. తెలుగు రాష్ట్రానికి చెందినవారైనప్పటికీ, ఇంతటి కథకు అండగా నిలిచిన నటుడు రానా దగ్గుబాటి మద్దతును కూడా ఆయన బహిరంగంగా కొనియాడారు.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ చిత్రంలో దాగిఉన్న అరటిపండును 9 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం
ఈ చిత్రంలో దాగిఉన్న అరటిపండును 9 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం
ఐపీఎల్ ఆరంభంలోనే కోహ్లీ ఊచకోత.. డేవిడ్ వార్నర్ రికార్డ్ బ్రేక్
ఐపీఎల్ ఆరంభంలోనే కోహ్లీ ఊచకోత.. డేవిడ్ వార్నర్ రికార్డ్ బ్రేక్
'ధురంధర్ 2' పై విమర్శలు గుప్పించిన స్టార్ డైరెక్టర్.. వీడియో
'ధురంధర్ 2' పై విమర్శలు గుప్పించిన స్టార్ డైరెక్టర్.. వీడియో
ఉగ్రవాద గ్రూపులకు ప్రధాన కేంద్రం పాకిస్థాన్..!
ఉగ్రవాద గ్రూపులకు ప్రధాన కేంద్రం పాకిస్థాన్..!
జస్ట్ ఒక్క బిస్కెట్ వేసినందుకు..130 కి.మీ వెంట నడిచిన శునకం
జస్ట్ ఒక్క బిస్కెట్ వేసినందుకు..130 కి.మీ వెంట నడిచిన శునకం
నాన్న కోసమే హీరోయిన్‏గా.. తెలుగులో క్రేజీ ఫాలోయింగ్..
నాన్న కోసమే హీరోయిన్‏గా.. తెలుగులో క్రేజీ ఫాలోయింగ్..
పాన్‌ కార్డు ఉన్న వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. 6 భారీ మార్పులు
పాన్‌ కార్డు ఉన్న వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. 6 భారీ మార్పులు
తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ మంటలు..
తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ మంటలు..
నోరూరించే వార్త.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు! కిలో ఎంతంటే..
నోరూరించే వార్త.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు! కిలో ఎంతంటే..
యాక్సిడెంట్లే కానీ మర్డర్స్.. ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్
యాక్సిడెంట్లే కానీ మర్డర్స్.. ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్