AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏప్రిల్ 1 నుండి మారనున్న కొత్త రూల్స్ ఇవే

ఏప్రిల్ 1 నుండి మారనున్న కొత్త రూల్స్ ఇవే

Phani CH
|

Updated on: Mar 28, 2026 | 1:21 PM

Share

కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 నుండి అనేక మార్పులు రానున్నాయి. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 ప్రకారం, ₹12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు లభిస్తుంది. రైల్వే టికెట్ రద్దు నిబంధనలు మారాయి. బ్యాంకుల ఏటీఎం, డెబిట్ కార్డు ఛార్జీలు, విత్‌డ్రాయల్ పరిమితులు సవరించబడ్డాయి. పాన్ కార్డుకు ఆధార్ పుట్టిన తేదీ రుజువుగా అంగీకరించరు. ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది, ఇవి సామాన్యుడిపై ప్రభావం చూపుతాయి.

కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. పన్ను విధానం నుండి బ్యాంకింగ్ వరకు సామాన్యుడి దైనందిన జీవితంపై ప్రభావం చూపబోయే అంశాలు మీకోసం. 1961 నాటి చట్టం స్థానంలో ‘కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025’ అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం పన్ను చెల్లింపుదారులకు గందరగోళంగా ఉన్న ‘అసెస్మెంట్ ఇయర్ ’, ‘ప్రీవియస్ ఇయర్ ’ వంటి పదాల స్థానంలో సులభంగా అర్థమయ్యేలా ‘పన్ను సంవత్సరం అనే పదాన్ని ఉపయోగించనున్నారు. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87ఏ కింద రిబేట్ పెంచడంతో, రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు లభించనుంది. ఫారం-16 స్థానంలో కొత్తగా ఫారం-130, 131లు రానున్నాయి. పాన్ కార్డు కోసం పుట్టిన తేదీ రుజువుగా ఆధార్‌ను అంగీకరించరు. కేవలం 10వ తరగతి సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్ మాత్రమే అవసరం. భారతీయ రైల్వే కూడా ప్రయాణికులకు అనుకూలంగా రైలు టికెట్ రద్దు నిబంధనలను రైల్వే శాఖ సవరించింది. పూర్తి రిఫండ్ పొందాలంటే రైలు బయల్దేరడానికి 8 గంటల ముందే టికెట్ రద్దు చేసుకోవాలి . 8 నుండి 24 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం రిఫండ్ లభిస్తుంది. అలాగే, కొన్ని ప్రధాన బ్యాంకులు తమ ఏటీఎం, డెబిట్ కార్డు నిబంధనలను మార్చాయి. HDFC, బంధన్ బ్యాంకులు ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి దాటితే ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ. 23 వసూలు చేయనున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డుల రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితిని రూ. 75,000 నుండి రూ. 50,000కి తగ్గించింది. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ఎల్‌పీజీ (LPG), సీఎన్‌జీ (CNG) మరియు విమాన ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది రవాణా ఖర్చులపై నేరుగా ప్రభావం చూపనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీతమ్మ కల్యాణానికి ‘పాలకోవ’ సారె

అయోధ్యలో అద్భుతం.. రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు

ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. కొత్త చట్టంపై దుమారం

మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్

సర్‌ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. సంతోషంతో తల్లి కన్నీళ్లు

Follow Us