AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్

మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్

Phani CH
|

Updated on: Mar 28, 2026 | 1:12 PM

Share

మహబూబ్ నగర్ లో హోంగార్డ్ కృష్ణ సాగర్ అద్భుతం చేశారు. నీటి పైపులో ఊపిరి ఆడక స్పృహ కోల్పోయిన నాగుపాముకు సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. చనిపోయిందనుకున్న పామును తిరిగి బతికించి, అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. ఈ మానవత్వపు చర్య సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని చాటిచెప్పింది.

సాధారణంగా నాగుపాము కనిపిస్తేనే ఆమడ దూరం పరుగులు తీస్తాం. అలాంటిది ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక నాగుపాముకు సీపీఆర్ (CPR) చేసి ప్రాణం పోశాడు ఒక హోంగార్డ్. మానవత్వాన్ని చాటుకున్న ఈ అరుదైన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నచింతకుంట మండలానికి చెందిన రైతు సుదర్శన్ తన పొలంలో వేరుశెనగ పంటకు నీరు పెట్టేందుకు వెళ్లగా, పైపులో నుంచి బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. లోపల నాగుపాము ఉండటాన్ని గమనించిన ఆయన, దాన్ని చంపడం ఇష్టం లేక వనపర్తి జిల్లాలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న సాగర్ స్నేక్ సోసైటీ వ్యవస్థాపకుడు కృష్ణ సాగర్ కు సమాచారం అందించారు. కృష్ణ సాగర్ అక్కడికి చేరుకునే లోపు, పైపులో ఊపిరి ఆడక ఆ పాము స్పృహ కోల్పోయింది. దాన్ని బయటకు తీయగా అది చనిపోయిందనే అందరూ భావించారు. కానీ కృష్ణ సాగర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పాముకి అత్యంత చాకచక్యంగా సీపీఆర్ చేశారు. గుండె భాగంలో నెమ్మదిగా ఒత్తుతూ, కొన్ని నీళ్లు చల్లడంతో కొద్దిసేపటికే ఆ పాము ప్రాణం లేచి వచ్చింది. చనిపోయిందనుకున్న పాము మళ్ళీ కదలడం చూసి అక్కడి వారు ఆశ్చర్యంతోపాటు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఆ నాగుపామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. “ఈ భూమి మీద ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది, అకారణంగా ఏ ప్రాణిని చంపవద్దు” అంటూ కృష్ణ సాగర్ ఇచ్చిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృత్యువు అంచున ఉన్న పామును కాపాడిన హోంగార్డ్ సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సర్‌ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. సంతోషంతో తల్లి కన్నీళ్లు

కుక్క కోసం మంటల్ని లెక్క చేయక.. ప్రాణాలకు తెగించిన యువతి

కాటేసిన పాముతో నేరుగా ఆసుపత్రికి.. వృద్ధుడి సాహసం

క్లాస్‌ రూమ్‌లో ప్రపోజ్‌ చేసిన ప్రొఫెసర్‌.. తరిమి తరిమి కొట్టిన స్టూడెంట్స్‌

దేశంలో నిరుపయోగంగా రూ.940 లక్షల కోట్ల బంగారం

Follow Us