AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్క కోసం మంటల్ని లెక్క చేయక.. ప్రాణాలకు తెగించిన యువతి

కుక్క కోసం మంటల్ని లెక్క చేయక.. ప్రాణాలకు తెగించిన యువతి

Phani CH
|

Updated on: Mar 28, 2026 | 1:08 PM

Share

ముంబైలోని మీరా రోడ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో వేర్‌హౌస్‌లో చిక్కుకున్న కుక్కను ఓ యువతి ప్రాణాలకు తెగించి కాపాడింది. మంటలను లెక్కచేయకుండా లోపలికి వెళ్లి దానిని రక్షించిన ఈ ధైర్యసాహసాల వీడియో వైరల్ అయ్యింది. మూగజీవి రక్షణకు ఆమె చూపిన అకుంఠిత దీక్షకు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

విశ్వాసానికి, నమ్మకానికి నిలువెత్తు రూపం శునకం. యజమానిని ప్రాణప్రదంగా ప్రేమిస్తూ, వారి రక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి వెనుకాడని జంతువు. తమకు తిండి పెట్టిన వారిని అంటిపెట్టుకుని, ఆపదలో అండగా ఉంటూ, మరణానంతరం కూడా యజమాని కోసం ఎదురుచూసేంతటి అత్యంత నమ్మకమైన మిత్రుడు. అలాంటి ఆ మూగజీవి రోదన ఎవరికి పడుతుంది.. సమస్య ఉన్నా పట్టదు.. తెలిసినా పట్టించు కోరు.. ఆ శునకం మాత్రం ప్రాణంతో పోరాడింది. మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది ఓ ఘటనజ ముంబైలోని మీరా రోడ్‌లో ఉన్న ఓ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. వేర్‌హౌస్‌లో ఉండే కుక్క మంటల్లో చిక్కుకుపోయింది. దాన్ని కట్టేసి ఉంచటంతో అక్కడి నుంచి పక్కకు రాలేక పోయింది. వేడికి తట్టుకోలేక ప్రాణ భయంతో గట్టిగా అరవటం మొదలెట్టింది. కుక్క అరుపులు విన్నా కూడా చాలా మంది మంటలకు భయపడి దాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. కానీ, ఓ యువతి మాత్రం ధైర్యం చేసింది. మంటల్లో చిక్కుకున్న కుక్క కోసం యువతి తన ప్రాణాలను పణంగా పెట్టింది. కుక్కను కాపాడ్డానికి మంటలను కూడా లెక్కచేయలేదు. లోపలికి వెళ్లి అతి కష్టం మీద దాన్ని విడిపించి తీసుకువచ్చింది. ఏ మాత్రం భయపడకుండా మంటల్లోకి వెళ్లి దాన్ని కాపాడింది. అయితే, అప్పటికే దానికి మంటల కారణంగా గాయాలు అయ్యాయి. భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపింది. కుక్కను ప్రాణాలకు తెగించి కాపాడిన ఆ యువతిని స్థానిక మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ యువతికి కచ్చితంగా అవార్డు ఇవ్వాలి. కుక్క కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. కొంచెం అటు, ఇటు అయినా ఆమె ప్రాణాలు పోయేవి’..‘మూగ జీవాల కోసం ప్రాణాలను కూడా లెక్కచేయని వారు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు’..‘పాపం.. ఆ కుక్కను చూస్తే జాలేస్తోంది. భయంతో మూగబోయింది’..‘ఆ అమ్మాయి లేకపోతే ఆ కుక్క పరిస్థితి ఘోరంగా ఉండేది. నిజంగా ఆమె ఓ దేవత’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాటేసిన పాముతో నేరుగా ఆసుపత్రికి.. వృద్ధుడి సాహసం

క్లాస్‌ రూమ్‌లో ప్రపోజ్‌ చేసిన ప్రొఫెసర్‌.. తరిమి తరిమి కొట్టిన స్టూడెంట్స్‌

దేశంలో నిరుపయోగంగా రూ.940 లక్షల కోట్ల బంగారం

ఫిట్స్‌ వచ్చి బైక్‌తో పడిపోయిన వ్యక్తి..కాపాడబోయిన రైతుకు షాక్‌

కాలేజ్‌ బాత్రూమ్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్‌

Follow Us