కాలేజ్ బాత్రూమ్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్
అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల బాత్‌రూమ్‌లో తెల్లవారుజామున ఓ పెద్ద ఎలుగుబంటి కలకలం సృష్టించింది. వాకింగ్ చేస్తున్న ప్రజలు దానిని చూసి భయంతో పరుగులు తీశారు. అటవీ శాఖకు సమాచారం అందగా, వారు కొన్ని గంటల పాటు శ్రమించి ఎలుగుబంటిని చాకచక్యంగా బంధించారు. చివరకు దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో బుధవారం తెల్లవారుజామున ఒక భయానక ఘటన జరిగింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాకింగ్ చేస్తున్న జనాలు ఆ ఘటన చూసి భయంతో పరుగులు తీశారు. కళాశాల బాత్రూమ్‌లోనుంచి వింత శబ్దాలు రావడంతో గమనించిన వారికి అక్కడి దృశ్యం చూడగానే గుండె గుబేల్ మంది. వెంటనే అక్కడినుంచి దూరంగా పరుగులు తీశారు. ప్రతిరోజూలాగే తెల్లవారుజామున కాలేజీ గ్రౌండ్‌లో వాకింగ్ చేసేందుకు వచ్చిన స్థానికులు, బాత్రూమ్‌లోనుంచి వస్తున్న శబ్ధాలు విని ఏమై ఉంటుందా అని పరిశీలించేందుకు దగ్గరగా వెళ్లారు. అక్కడ వాష్‌రూమ్‌లో ఓ పెద్ద ఎలుగుబంటి కనిపించింది. ఒక్కసారిగా ఎలుగుబంటిని చూసి నిర్ఘాంతపోయారు. భయంతో కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు మరియు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది, ఎలుగుబంటిని బంధించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. బాత్రూం లోపల ఉన్న ఎలుగుబంటి బయటకు రాకపోవడంతో ఆపరేషన్ కష్టతరమైంది. కొన్ని గంటల పాటు శ్రమించిన సిబ్బంది, చాకచక్యంగా వలలు వేసి ఎలుగుబంటిని బంధించారు. ఎలుగుబంటిని చూడటానికి భారీగా జనం తరలివచ్చారు. ఎట్టకేలకు ఎలుగుబంటిని సురక్షితంగా బోనులో బంధించి, రాయదుర్గం శివారులోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhurandar 2: ధురంధర్ సక్సెస్ విషయంలో బాలీవుడ్ సైలెన్స్‌కు రీజనేంటి ??
Drishyam 3: దృశ్యం 3 విషయంలో కన్ఫ్యూజన్.. తెలుగు వెర్షన్ ఉంటుందా ?? లేదా ?? అన్న డౌట్స్
Prabhas: డోంట్ కేర్.. నేను ఫుల్ క్లారిటీ తో ఉన్న అంటున్న డార్లింగ్
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే

