AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drishyam 3: దృశ్యం 3 విషయంలో కన్ఫ్యూజన్.. తెలుగు వెర్షన్ ఉంటుందా ?? లేదా ?? అన్న డౌట్స్‌

Drishyam 3: దృశ్యం 3 విషయంలో కన్ఫ్యూజన్.. తెలుగు వెర్షన్ ఉంటుందా ?? లేదా ?? అన్న డౌట్స్‌

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 28, 2026 | 11:37 AM

Share

"బైకర్" సినిమా ప్రమోషన్స్ వేడెక్కాయి. "బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి" బయోపిక్ నుండి "కోసింది కొయగూర" పాట విడుదలైంది. అక్షయ్ కుమార్ "భూత్ బంగ్లా" నుండి రొమాంటిక్ పాట రిలీజ్. డ్వేన్ జాన్సన్ "మోవానా" లైవ్ యాక్షన్ తెలుగు ట్రైలర్, ఆశిష్ "దేత్తడి" గ్లింప్స్ విడుదల. ఈ వారం సినిమా విశేషాలపై పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో బైకర్ మూవీ టీమ్‌ ప్రమోషన్స్ స్పీడు పెంచింది. ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. మంగళవారం వైజాగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్రయూనిట్ అంతా పాల్గొంది. రేసింగ్‌ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆనంది లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకు గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కోసింది కొయగూర అనే పాట విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు చరణ్ అర్జున్‌ సంగీతం అందిస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌, ప్రియదర్శన్ కాంబినేషన్‌లో భూత్‌ బంగ్లా మూవీ తెరకెక్కుతోంది. హారర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. బాలీవుడ్ స్టార్ సింగర్‌ అర్జిత్‌ సింగ్‌ రిటైర్మెంట్‌కు ముందు ఈ పాటను ఆలపించారు. వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. సెన్సేషనల్ హాలీవుడ్ యానిమేషన్ మూవీ మోవానా, ఇప్పుడు లైవ్ యాక్షన్‌ సినిమాగా రాబోతుంది. డ్వేన్‌ జాన్సన్‌ లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమాలో 17 ఏళ్ల కాథరిన్ లగాయ మోవానా పాత్రలో నటిస్తున్నారు. జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఆశిష్ లీడ్ రోల్‌ తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్‌ దేత్తడి. ఆదిత్యరావ్ గంగసాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్‌. సినిమాకు సంబందించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్టైల్ మార్చిన అందాల భామలు

Prabhas: డోంట్ కేర్.. నేను ఫుల్ క్లారిటీ తో ఉన్న అంటున్న డార్లింగ్

సేఫ్ జోన్ వదిలి.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు

ఆ సంగీత దర్శకులకు స్పెషల్ క్రేజ్.. ఎందుకో తెలుసా

Follow Us