AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్లాస్‌ రూమ్‌లో ప్రపోజ్‌ చేసిన ప్రొఫెసర్‌.. తరిమి తరిమి కొట్టిన స్టూడెంట్స్‌

క్లాస్‌ రూమ్‌లో ప్రపోజ్‌ చేసిన ప్రొఫెసర్‌.. తరిమి తరిమి కొట్టిన స్టూడెంట్స్‌

Phani CH
|

Updated on: Mar 28, 2026 | 11:52 AM

Share

బెంగళూరు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ ఒక విద్యార్థినికి తరగతి గదిలో ప్రేమ ప్రతిపాదన చేశాడు. షాక్ అయిన విద్యార్థిని వెంటనే ప్రొఫెసర్‌ను చెప్పుతో కొట్టగా, తోటి విద్యార్థులు అతనికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ప్రొఫెసర్‌ కోసం గాలిస్తున్నారు.

బెంగళూరు శివార్లలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో లెక్చర్ చెబుతూనే ఓ విద్యార్థినికి ప్రేమ ప్రతిపాదన చేసిన ప్రొఫెసర్‌కు తోటి విద్యార్థులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది. నెల్లమంగళ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సదరు కాలేజీలో ప్రొఫెసర్ లెక్చర్ ఇస్తూనే అకస్మాత్తుగా ఒక విద్యార్థినికి చాక్లెట్ ఇచ్చాడు. “ఈ బ్యాచ్‌లోనే మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మాయికి నేను చాక్లెట్ ఇస్తున్నాను.. ఐ లవ్ యూ” అంటూ అందరి ముందే ప్రపోజ్ చేశాడు. ఈ అనూహ్య పరిణామానికి షాక్ తిన్న ఆ విద్యార్థిని, వెంటనే తేరుకుని ప్రొఫెసర్ ప్రవర్తనను నిలదీసింది. ఆగ్రహంతో తన చెప్పు తీసి ప్రొఫెసర్‌ను కొట్టింది. విద్యార్థిని ధైర్యం చేయడంతో తోటి విద్యార్థులు కూడా ప్రొఫెసర్‌పై విరుచుకుపడ్డారు. అతను తప్పించుకుని కారు వైపు పరుగెత్తుతుండగా, విద్యార్థులు వెంటాడి మరీ దేహశుద్ధి చేశారు. ఈ ఘటనలో ఆ ప్రొఫెసర్ తనను తాను సమర్థించుకుంటూ సదరు విద్యార్థిని కూడా తనకు ప్రపోజ్ చేసిందని, సీసీటీవీ ఫుటేజీ ఉందంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ ఆధారాలు చూపాలని విద్యార్థిని సవాల్ చేయడంతో అక్కడి నుండి పరారయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న సదరు ప్రొఫెసర్ కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశంలో నిరుపయోగంగా రూ.940 లక్షల కోట్ల బంగారం

ఫిట్స్‌ వచ్చి బైక్‌తో పడిపోయిన వ్యక్తి..కాపాడబోయిన రైతుకు షాక్‌

కాలేజ్‌ బాత్రూమ్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్‌

Dhurandar 2: ధురంధర్‌ సక్సెస్ విషయంలో బాలీవుడ్ సైలెన్స్‌కు రీజనేంటి ??

Drishyam 3: దృశ్యం 3 విషయంలో కన్ఫ్యూజన్.. తెలుగు వెర్షన్ ఉంటుందా ?? లేదా ?? అన్న డౌట్స్‌

Follow Us