AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాటేసిన పాముతో నేరుగా ఆసుపత్రికి.. వృద్ధుడి సాహసం

కాటేసిన పాముతో నేరుగా ఆసుపత్రికి.. వృద్ధుడి సాహసం

Phani CH
|

Updated on: Mar 28, 2026 | 1:05 PM

Share

వియత్నాంలో 79 ఏళ్ల వృద్ధుడు నాగుపాము కాటుకు గురైనప్పటికీ, భయపడకుండా దానిని పట్టుకుని ఇంటికొచ్చాడు. ఈ ధైర్యసాహసాలు వైరల్ అయ్యాయి. మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి పాముకాటు తర్వాత పామును సజీవంగా ఆస్పత్రికి తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అసాధారణ పాము కాటు ఘటనలు నెటిజన్లను విస్మయపరుస్తున్నాయి. బాధితులు చికిత్స పొందుతున్నారు.

వియత్నాంలోని డా నాంగ్ పల్లెటూరిలో 79 ఏళ్ల వృద్ధుడిని విషపూరితమైన నాగుపాము కరిచింది. ఎడమ చేయి కోల్పోయి అంగవైకల్యంతో ఉన్న ఆ వృద్ధుడిని పాము కుడి మోచేతి ప్రాంతంలో కాటేసింది. ప్రాణాపాయ స్థితిలో కూడా ఏమాత్రం బెదరకుండా ఆ భారీ నాగు పామును భుజం కింద గట్టిగా అదిమి పట్టుకుని పొలం దాటుకుంటూ ఇంటి వరకూ నడుచుకుంటూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వరిపొలంలో పనిచేస్తుండగానే వృద్ధుడిని పాము కాటేసింది. వెంటనే అప్రమత్తమైన అతను.. ఏ మాత్రం భయపడకుండా పామును పట్టుకొని నేరుగా ఇంటికెళ్లాడు. అతని చేతిలో పామును చూసి కుటుంబసభ్యులు తొలుత భయపడ్డారు. తర్వాత వృద్ధుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడికి మొదట క్వాంగ్ నామ్ ఉత్తర పర్వత ప్రాంతంలోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత డా నాంగ్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వైద్య సిబ్బంది యాంటీ వీనమ్‌ ఇవ్వడంతో ప్రస్తుతం వృద్ధుడు కోలుకుంటున్నారు. వీడియో నెట్టింట వైరల్ అవుతోండటంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘భూమిపై ఇంకా నూకలు ఉన్నాయి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘ఆ వృద్ధుడి గుండె ధైర్యం ముందు.. అంగవైకల్యం ఓడిపోయింది’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరో ఉదంతంలో.. అడుగున్నర పొడవున్న ఒక సర్పాన్ని చలికోటులో దాచుకుని నేరుగా ఆస్పత్రికి వచ్చి ఓ వ్యక్తి హల్‌చల్‌ సృష్టించారు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా ఆస్పత్రిలో వృత్తిరీత్యా ఇ–రిక్షా డ్రైవర్‌ అయిన 39 ఏళ్ల దీపక్‌ . పాము కాటేసిందంటూ ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అయితే ఏ పాము కరిచిందో గుర్తుందా? అని అక్కడి సిబ్బంది అడగ్గా.. ఇదిగో ఇదే పాము అంటూ తన జర్కిన్‌లో దాచి తెచ్చిన తాచుపామును బయటకు తీశారు. దీంతో అక్కడి వాళ్లంతా హడలిపోయారు. వెంటనే పామును దూరంగా వదిలేసి రావాలని సూచించినా వినకుండా విరుగుడు మందు కావాలని డిమాండ్‌ చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్లాస్‌ రూమ్‌లో ప్రపోజ్‌ చేసిన ప్రొఫెసర్‌.. తరిమి తరిమి కొట్టిన స్టూడెంట్స్‌

దేశంలో నిరుపయోగంగా రూ.940 లక్షల కోట్ల బంగారం

ఫిట్స్‌ వచ్చి బైక్‌తో పడిపోయిన వ్యక్తి..కాపాడబోయిన రైతుకు షాక్‌

కాలేజ్‌ బాత్రూమ్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్‌

Dhurandar 2: ధురంధర్‌ సక్సెస్ విషయంలో బాలీవుడ్ సైలెన్స్‌కు రీజనేంటి ??

Follow Us