AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్‌ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. సంతోషంతో తల్లి కన్నీళ్లు

సర్‌ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. సంతోషంతో తల్లి కన్నీళ్లు

Phani CH
|

Updated on: Mar 28, 2026 | 1:10 PM

Share

తెలుగులో ఒక కొడుకు తన తల్లికి అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చాడు. గోవాలో నివసించే ఆ తల్లికి స్టార్ క్రికెటర్ జాంటీ రోడ్స్ అంటే ఎంతో అభిమానం. తన తల్లికి ఇష్టమైన క్రికెటర్‌ను కలిసే అవకాశం కల్పించి, కొడుకు ఆమె కలను నిజం చేశాడు. జిమ్‌లో జాంటీ రోడ్స్‌ను చూడగానే ఆమె ఆనందానికి అవధులు లేవు. ఈ భావోద్వేగ క్షణాలను చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సృష్టిలో తియ్యనిది అమ్మప్రేమ. నవమోసాలు మోసి బిడ్డలను కని ప్రపంచానికి పరిచయం చేస్తుంది అమ్మ. అలాంటి ఓ అమ్మకి ఓ యువకుడు ఆమె కలలో కూడా ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. గోవాకు చెందిన ఓ మహిళకు చిన్నప్పటినుంచి స్టార్ క్రికెటర్ జాంటీ రోడ్స్ అంటే ఎంతో ఇష్టం. ఆ విషయాన్ని తరచుగా తన కొడుకు హర్షిత్‌కు చెబుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే హర్షిత్ తన తల్లికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. కొద్దిరోజుల క్రితం హర్షిత్ తన తల్లీతో కలిసి గోవాలోని ఓ జిమ్‌కు వెళ్లాడు. వర్కవుట్లు చేస్తుండగా జాంటీ రోడ్స్ అక్కడికి వచ్చాడు. అతడిని చూసి హర్షిత్ తల్లి ఆశ్చర్యపోయింది. జాంటీ రోడ్స్ నేరుగా ఆమె దగ్గరకు వచ్చాడు. దీంతో ఆమె సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. జాంటీ రోడ్స్ కొద్దిసేపు ఆమెతో మాట్లాడాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెళ్లిపోయే ముందు టీ షర్ట్‌పై సంతకం చేసి ఆమెకు ఇచ్చాడు. జాంటీ రోడ్స్ అంటే నైంటీస్ కిడ్స్‌కు చాలా ఇష్టం. అతడిని గాడ్ ఆఫ్ ఫీల్డింగ్ అంటారు. జాంటీ రోడ్స్‌కు ఇండియా అంటే చాలా ఇష్టం. అందుకే సంవత్సరంలో కొన్ని నెలల పాటు గోవాలో ఉంటారు. గోవా అంటే ఆయనకు ఎంతో ఇష్టం’. ఆ సంఘటనకు సంబంధించిన వీడియోను హర్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆమె సంతోషం చూస్తే నాకు కన్నీళ్లు వస్తున్నాయి. నీలాంటి కొడుకులు ఉంటే తల్లులు సంతోషంగా ఉంటారు’..‘ఈ రోజు నేను చూసిన ది బెస్ట్ వీడియో ఇదే. చాలా సంతోషంగా ఉంది’..అంటూ కామెంట్లు చేస్తున్నారు. తనకిష్టమైన క్రికెట‌ర్‌ను చూడగానే ఆ తల్లి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుక్క కోసం మంటల్ని లెక్క చేయక.. ప్రాణాలకు తెగించిన యువతి

కాటేసిన పాముతో నేరుగా ఆసుపత్రికి.. వృద్ధుడి సాహసం

క్లాస్‌ రూమ్‌లో ప్రపోజ్‌ చేసిన ప్రొఫెసర్‌.. తరిమి తరిమి కొట్టిన స్టూడెంట్స్‌

దేశంలో నిరుపయోగంగా రూ.940 లక్షల కోట్ల బంగారం

ఫిట్స్‌ వచ్చి బైక్‌తో పడిపోయిన వ్యక్తి..కాపాడబోయిన రైతుకు షాక్‌

Follow Us