AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌లో పాలు త్వరగా పాడవుతున్నాయా?.. జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే చాలు.. రోజంతా ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు!

Summer Milk Storage Tips: ఎండాకలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఎదురయ్యే ప్రదాన సమస్య.. తెచ్చుకున్న కూరగాయలు, పాలు, పెరుగు త్వరగా పాడైపోవడం. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పాలు, పెరుగులోని బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది, అవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కానీ మనం కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా పాలను ఎక్కువ సమయం తాజాగా ఉంచుకోవచ్చు. కాబట్టి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: May 15, 2026 | 10:13 PM

Share
సరైన టైంలో మరిగించడం: చాలా మంది మార్కెట్ నుంచి పాలు తెచ్చిన తర్వాత కాసేపు అలానే ఉంచి తర్వాత కాగబెడతారు.కానీ వేసవిలో ఇలా చేయడం తప్పు.. మీరు షాప్‌ నుంచి తెచ్చిన వెంటనే పాలను కాగబెట్టండి. ఎందుకంటే మీరే షాప్‌ నుంచి తెచ్చే మార్గంలోనే ఉష్ణోగ్రతల వల్ల దానిలో ఉండే బ్యాక్టీరియా వృద్ధి చెందవచ్చు. కాబట్టి వేసవిలో, పాలను రోజుకు రెండుసార్లు, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మరిగించడం ఉత్తమం.

1 / 5
శుభ్రమైన పాత్రలలో మరిగించడం: కొన్ని సార్లు మరిగించే పాత్ర సరిగ్గా లేకపోయానా పాలు విరిగిపోతాయి. కాబట్టి పాలను మరిగించే ముందు పాత్ర శుభ్రంగా కడగండి. అలానే మరిగించిన పాలను నిల్వ చేయడానికి శుభ్రమైన, పొడి పాత్రలను ఉపయోగించండి. పాత్రలలో మిగిలి ఉన్న కొద్దిపాటి పాలు లేదా తేమ అయినా బ్యాక్టీరియా వృద్ధిని పెంచుతుంది. అలాగే పాలను మరిగించేందుకు ఎప్పుడూ  స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలనే వాడడండి. ఎందుకంటే వాటిని శుభ్రపరచడం, నిర్వహించడం సులభం. అంతేకాకుండా, పాలు చల్లారిన వెంటనే వాటిని తప్పకుండా ఫ్రిజ్‌లో పెట్టండి .

2 / 5
ఫ్రిజ్‌లో నిల్వ చేయండి: పాలు గది ఉష్ణోగ్రతకు చల్లారిన తర్వాత వాటిని ఫ్రిజ్‌లో పెట్టడం చాలా ముఖ్యం. పాలను ఎక్కువసేపు గది ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం వల్ల అవి చాలా త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవిలో, పాలను ప్రిజ్‌ డోర్ దగ్గర పెట్టడం కన్నా.. డీ ప్రిజ్‌లో ఉంచడం చాలా ఉత్తమం. ఎందుకంటే తరచూ మనం డోర్ తీస్తూ ఉంటాం. దీని వల్ల ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఈ కారణంగా పాలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

3 / 5
బేకింగ్ సోడాను ఉపయోగించండి: పాలు విరిగిపోకుండా ఉండాలంటే మీకు బేకింగ్ సొడా చాలా బాగా ఉపయోగపడుతుంది. పాలలో చిటికెడు బేకింగ్ సోడా కలపడం వల్ల ఆమ్లత్వాన్ని తటస్థీకరించి, పాల నిల్వ కాలాన్ని కొద్దిగా పొడిగించవచ్చు. బేకింగ్ సోడాను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎక్కువగా కలిపితే పాల అసలు రుచి మారిపోతుంది.

4 / 5
మళ్లీ మళ్లీ ప్రిజ్‌ నుంచి బయటకు తీయడం: పాలను ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత మళ్లీ మళ్లీ తిసి పెట్టడం చేయరాదు. ఇలా తీయడం వల్ల వాటి ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి, దీనివల్ల బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి మీకు కావాల్సిన పాలను ముందుగానే తీసి ఉంచుకోండి, లేదా సపరేట్‌గా చిన్న చిన్న పాత్రల్లో నిల్వ చేసుకోండి. సమ్మర్ ఈ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా మీరు ఎక్కవ సమయం పాలను తాజాగా ఉంచుకోవచ్చు.

5 / 5
Follow Us
90 రోజుల వ్యాలిడిటీతో వచ్చే జియో సూపర్‌ ప్లాన్‌.. 20GB బోనస్ డేటా

పొరపాటున ఆటో డ్రైవర్‌కు రూ.15వేలు పంపిన సీఈఓ.. సీన్ కట్‌చేస్తే..

బాడీని చిటికెలో కూల్ చేసే పొలం గారెలు.. పూర్వీకుల బలమైన ఆహారం

సంపద, సానుకూల శక్తి కోసం ఫ్రిజ్‌పై ఎలాంటి మాగ్నెట్లు పెట్టాలంటే..

నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్.. మిస్సైనందుకు ఏడ్చేసిన హీరోయిన్..

ఏడాదికి రూ.10 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే ఏమవుతుంది..

బుడ్డదాని బుగ్గ గిల్లబోయిన బుడ్డోడు.. ఇంతలో ఊహించని షాక్..

పెద్దిలో జాన్వీ కపూర్‏కు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.. ?

ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన అటుకుల బెల్లం ఉండలు..

రేపే భాను సప్తమి.. సూర్యారాధనతో ధన, గౌరవ యోగం.. ఈ 5 తప్పులు..