AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : చిరంజీవి నా జూనియర్.. నా సినిమాల్లో విలన్‏గా చేశాడు.. టాలీవుడ్ నటుడు..

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన చిరు.. పలు చిత్రాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు సైతం పోషించారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు చిరుతో తనకున్న అనుబందం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Actor : చిరంజీవి నా జూనియర్.. నా సినిమాల్లో విలన్‏గా చేశాడు.. టాలీవుడ్ నటుడు..
Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Mar 29, 2026 | 10:44 AM

Share

సీనియర్ నటుడు నరసింహరాజు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ఒకప్పుడు హీరోగా కనిపించిన ఆయన.. ఆ తర్వాత సహయ నటుడిగా రాణించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం, కీలక మలుపులు, అనుభవాలను పంచుకున్నారు. 1969లో చెన్నైలో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన నరసింహరాజు, ప్రస్తుతం 51 ఏళ్లుగా పరిశ్రమలో చురుకుగా ఉన్నారు. ఒకప్పుడు ఆంధ్ర కమలహాసన్ గా పేరుపొందిన ఆయన, వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ముఖ్యంగా జానపద చిత్రాలకు తన పేరు పర్యాయపదంగా నిలిచిందని, విఠలాచార్య వంటి దర్శకులు తనతో అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: అలాంటి హీరోను నా జీవితంలో చూడలేదు.. ఆయన వల్లే నా జీవితం మారిపోయింది.. తనికెళ్ల భరణి..

దాసరి నారాయణరావుతో అనుబంధం, వ్యాపార విరామం:

నరసింహరాజు కెరీర్‌లో దాసరి నారాయణరావు పాత్ర ఎంతో కీలకం. దాసరి దర్శకత్వంలో తూర్పు పడమర వంటి మూడు హిట్ చిత్రాలు చేసిన తర్వాత, దాసరి స్వయంగా కొన్ని వ్యాపారాలను చూసుకోమని కోరారని నరసింహరాజు తెలిపారు. హైదరాబాద్‌కు మకాం మార్చిన తర్వాత, దాసరి గారి ఎడిటింగ్ రూమ్‌లు ఉన్న ఒక భవనాన్ని గెస్ట్‌హౌస్‌గా అభివృద్ధి చేసి, రోజుకు 30-40 వేల రూపాయల లాభాలు రాబట్టినట్లు వెల్లడించారు. ఈ వ్యాపార విజయంతో సంతృప్తి చెంది, దాసరి సినిమాల్లో పాత్రలు చేయమని కోరినా, విరామం తీసుకున్నానని పేర్కొన్నారు. ఇదే సమయంలో చెన్నైకి తిరిగి వెళ్లాలనే ఉద్దేశంతో మాదాపూర్ వంటి ప్రాంతాల్లో భూములు కొనే అవకాశాన్ని కూడా వదులుకున్నానని చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : హీరో ముసలోడు అని కొనేవాడు రాలేదు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ, పునాదిరాళ్లు చిత్రంలో తను హీరోగా, చిరంజీవి విలన్‌గా నటించిన నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. చిరంజీవి అప్పట్లోనే మంచి నటుడు అవుతారని, గొప్ప స్టార్‌గా ఎదుగుతారని తనకు తెలుసునని అన్నారు. పాటలు ప్లే అవుతున్నప్పుడు చిరంజీవి పక్కవారిని పట్టించుకోకుండా డ్యాన్స్ చేసేవారని, అది ఆయన కృషికి నిదర్శనమని చెప్పారు. చిరంజీవి కృషి, మంచి మనస్సు కలిగిన వ్యక్తి అని, అందుకే ఈ స్థాయికి చేరుకున్నారని, ఆయన ఎదుగుదల పట్ల తనకు చాలా ఆనందంగా ఉందని నరసింహరాజు పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..

Actor Narasimha Raju , Chir

Actor Narasimha Raju , Chir

ఎక్కువమంది చదివినవి : Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Follow Us