AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..

దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా బాహుబలి ది కన్ క్లూజన్. అప్పటివరకు ఉన్న ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను ఆ చిత్రం బ్రేక్ చేసింది. ఆ తర్వాత విడుదలైన బాహుబలి 2 మూవీ సైతం సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంతో వరల్డ్ వైడ్ క్రేజ్ సొంతేం చేసుకున్నారు ప్రభాస్.

Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..
Ajay Ghosh
Rajitha Chanti
|

Updated on: Mar 28, 2026 | 6:59 PM

Share

ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులో బిజీ నటుడు. సహాయ నటుడిగా, విలన్ పాత్రలతో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, ఆదర్శాలు, కొన్ని మరపురాని సంఘటనల గురించి పంచుకున్నారు. బాహుబలి-2 చిత్రంలో తాను నటించినప్పటికీ, నిడివి ఎక్కువ కావడంతో తన సన్నివేశాలను చివరి నిమిషంలో తొలగించారని ఆయన తెలిపారు. ఈ విషయంపై తాను ఎప్పుడూ బాధపడలేదని, కానీ చాలా మంది “బాహుబలిలో నటించి ఎందుకు కనిపించలేదు?” అని అడుగుతుంటారని చెప్పారు. చెన్నైలో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఈ విషయం ప్రస్తావనలోకి వచ్చినప్పుడు, అది పెద్ద ప్రచారాన్ని తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Actress : ఆదర్శ కుటుంబంలోకి మరో హీరోయిన్.. ప్లాప్ హీరోయిన్‏కు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. ?

నటుడు అజయ్ ఘోష్ సైతం బాహుబలి 2 నటించానని.. సీన్స్ డెలీట్ చేసినప్పటికీ.. ఈ సినిమాలో తాను నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యిందని.. దీంతో తాను చాలా ఫేమస్ అయ్యానని చెప్పుకొచ్చారు. తన నటనా జీవితంలో ప్రేక్షకుల మన్ననలే అత్యున్నత అవార్డులని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. ఫోన్‌లు, మెసేజ్‌ల ద్వారా లభించే స్పందన కంటే, ప్రజలు నేరుగా తమ అభిప్రాయాన్ని చెప్పడం తనకు ఎక్కువ సంతృప్తినిస్తుందని వివరించారు. ఒక విలన్ పాత్రలో నటించినప్పుడు, ప్రేక్షకులు “వాడిని కొడితే బాగుండు” అని అనుకుంటే అది నటుడిగా విజయం సాధించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎక్కువమంది చదివినవి : Actor : ఆరుగురు పతివ్రతలు తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు.. కారణం ఇదే.. టాలీవుడ్ నటుడు..

అజయ్ ఘోష్ లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావును తన నటనా గురువుగా, ఆదర్శంగా పేర్కొన్నారు. ప్రతిఘటన చిత్రం నుండి కోట శ్రీనివాసరావు నటనకు తాను అభిమానినని చెప్పారు. గణేష్ సినిమాలో కోట గారు హోం మినిస్టర్ పాత్రలో ప్రదర్శించిన వేరియేషన్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. కోట శ్రీనివాసరావు మాదిరిగానే పాత్రలో లీనమై, పాత్రే కనిపించాలి గానీ, నటుడు కనిపించకూడదనే సిద్ధాంతాన్ని తాను పాటిస్తానని చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె.. కానీ తన అమ్మ వల్లే ఆమె జీవితం అలా.. నటుడు మురళీ మోహన్..

Baahubali 2, Ajay Ghosh

Baahubali 2, Ajay Ghosh

ఎక్కువమంది చదివినవి : Cinema : సీన్ సీన్‏కు గుండె ఆగిపోద్ది మావ.. క్లైమాక్స్ మాత్రం బీభత్సం.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న హారర్ సిరీస్..

Follow Us