AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : హీరోలందరూ రిజెక్ట్ చేశారు.. సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టైంది..

దర్శకుడు వి. సముద్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి అనేక విషయాలు వెల్లడించారు.

Tollywood : హీరోలందరూ రిజెక్ట్ చేశారు.. సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టైంది..
V Samudra
Rajitha Chanti
|

Updated on: Mar 29, 2026 | 9:54 AM

Share

దర్శకుడు వి. సముద్ర తన తొలి చిత్రం సింహరాశి వెనుకనున్న ఆసక్తికరమైన కథను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఒక దర్శకుడిగా తొలి విజయం సాధించాలంటే అమ్మ సెంటిమెంట్‌తో కూడిన కథను ఎంచుకోవాలని ఆయన బలంగా నమ్మానని అన్నారు. ఈ ఆలోచనతోనే ఒక తల్లి సెంటిమెంట్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశానని.. దీనిని ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి రాజశేఖర్, నాగార్జున, వెంకటేష్, విజయకాంత్, తమిళ విజయ్ వంటి అగ్రనటులకు వినిపించానని అన్నారు. అయితే, కథలోని తీవ్రమైన యాక్షన్ అంశాల వల్ల ఏ నటుడూ దీనిని చేయడానికి ఆసక్తి చూపించలేదని అన్నారు.

ఈ క్రమంలో, సముద్ర తమిళంలో మంచి ప్రజాదరణ పొందిన మాయ చిత్రాన్ని చూసి, దానిని తెలుగులోకి రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట. బాలయ్య బాబు చెన్నకేశవరెడ్డి చిత్రాన్ని ఆఫర్ చేసినప్పటికీ, సముద్ర సింహరాశికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్.బి. చౌదరి రాజశేఖర్‌కు సింహరాశి కథను చెప్పి, షిండే, సముద్రలలో ఒకరిని దర్శకుడిగా ఎంచుకోమని సూచించారు. అప్పటికే హిట్ అందించిన షిండేను కాదని, కథలో సముద్ర చూపించిన పదునును మెచ్చి రాజశేఖర్ ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇదే తన మొదటి దర్శకత్వ అవకాశం కావడంతో రాజశేఖర్‌కు సముద్ర ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటానని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : హీరో ముసలోడు అని కొనేవాడు రాలేదు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

అయితే, రాజశేఖర్‌కు సినిమా విజయంపై కొన్ని సందేహాలు కలిగాయి. హీరో ఒకే డ్రెస్‌లో కనిపించడం, నేలపై కూర్చోవడం, హీరోయిన్‌ను తాకకపోవడం వంటి అసాధారణ పాత్ర ఆయనను కలవరపరిచింది. కానీ, రాజశేఖర్ దర్శకుడి మాట వినే స్వభావం కలవారు కావడంతో, పాత్రను అద్భుతంగా మలచుకున్నారు. సముద్ర రాజశేఖర్ నటనను యాక్షన్, ఫ్యామిలీ డ్రామా కోణాల్లో ప్రదర్శించేలా చేశారు. అంకుశం, ఆగ్రహం, మగాడు, ఎవడైతే నాకేంటి వంటి రాజశేఖర్ హిట్ చిత్రాలన్నీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలేనని, సింహరాశి కూడా అదే కోవలోకి వస్తుందని సముద్ర వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: అలాంటి హీరోను నా జీవితంలో చూడలేదు.. ఆయన వల్లే నా జీవితం మారిపోయింది.. తనికెళ్ల భరణి..

చిత్రీకరణ సమయంలో సముద్ర టీమ్‌లోని వంద మంది సభ్యులు కూడా ఈ సినిమా ఆడదని ముఖం మీదే చెప్పారట. కుష్టు రోగం ఉన్న తల్లి, హీరోయిన్‌ను తాకని హీరో వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవని వారు నమ్మారు. కానీ, సముద్ర వారి మాటలను పట్టించుకోకుండా, తన దృష్టిని కథను వజ్రంగా తీర్చిదిద్దడంపైనే కేంద్రీకరించారు. ప్రతి సన్నివేశంలోనూ మెరుగుదల సాధించడానికి కృషి చేశారు. గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాత్రమే “అమ్మా అమ్మా అని నన్ను పిలవకు” అనే పాట రాసేటప్పుడు కథను అద్భుతంగా ప్రశంసించిన ఏకైక వ్యక్తి.

ఎక్కువమంది చదివినవి : Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..

సినిమా పూర్తయ్యాక కూడా యూనిట్ సభ్యులు సినిమా విజయంపై సందేహాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ తన ఆత్మవిశ్వాసం తగ్గలేదని. ఒక దర్శకుడికి తన నిర్ణయంపై దృఢత్వం ఉండటం అత్యంత కీలకమని తాను నమ్మానని అన్నారు. అంకుశం తర్వాత రాజశేఖర్ కెరీర్‌లో సింహరాశియే ఒక మైలురాయి చిత్రమని, ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులకు అదే గుర్తుంటుందని సముద్ర తెలిపారు.

సినిమాలోని గొప్ప ఫిలాసఫీ, తల్లి ప్రేమ, త్యాగం, సేవ వంటి అంశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక వేశ్యను చూసి హీరో “నీలో మా అమ్మ కనపడుతుంది” అనే సంభాషణ, హీరోయిన్‌ను తాకకుండా హీరో తన పవిత్రతను నిలబెట్టుకునే సన్నివేశాలు ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాయి. రాజశేఖర్ కూడా సముద్ర నిర్ణయాలను ఎంతగానో విశ్వసించేవారని తెలిపారు. దాదాపు 25 సంవత్సరాలు గడిచినా, ప్రతి నెలా సింహరాశి టీవీలో ప్రసారమైనప్పుడు తనకు ఫోన్‌ కాల్స్ వస్తూనే ఉంటాయని, ఆ సినిమా ప్రభావం అలాంటిదని సముద్ర తెలిపారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, మల్లికార్జున్ లతో కూడిన “ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపు తీగ” అనే కామెడీ ట్రాక్ తమిళ వెర్షన్‌లో ఉన్నప్పటికీ, తెలుగులో అద్భుతమైన విజయం సాధించి, ఇప్పటికీ మీమ్స్‌గా వైరల్ అవుతోందని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Follow Us