AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ కెమెరా.. దీంతో ఫోటోలు తీస్తే ఉంటుందీ.. ఒకే ఫ్రేమ్‌లో 50 వేల..

అంతరిక్ష పరిశోధనల్లో శాస్త్రవేత్తలు ఈ సరికొత్త మైలురాయిని సాధించారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరా అంతరిక్షానికి సంబంధించిన ఒక ప్రధాన రహస్యాన్ని వెల్లడించారు.. తొలిసారిగా, 50,000 నక్షత్రాలు, 500,000 గెలాక్సీలను ఒకే ఫ్రేమ్‌లో బంధించారు. ఈ కెమెరా తీసిన వందలాది ఫోటోలను ప్రత్యేక సాంకేతికత ద్వారా ఒకదానిపై ఒకటి అమర్చి డిజిటల్‌గా అనుసంధానించారు. దీనివల్ల విశ్వంలో ఇప్పటివరకు చూడని వింతలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోటోలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది.

ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ కెమెరా.. దీంతో ఫోటోలు తీస్తే ఉంటుందీ.. ఒకే ఫ్రేమ్‌లో 50 వేల..
World's Largest Digital Camera
Jyothi Gadda
|

Updated on: Aug 04, 2026 | 7:53 AM

Share

ఖగోళ శాస్త్ర రంగంలో శాస్త్రవేత్తలు ఒక చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. అంతరిక్షంలోని నిగూఢ రహస్యాలను ఛేదించే దిశగా ప్రపంచంలోనే అత్యంత భారీ డిజిటల్ కెమెరా సహాయంతో రూపొందించిన అత్యంత స్పష్టమైన చిత్రాన్ని విడుదల చేశారు. దక్షిణ అమెరికా దేశమైన చిలీలో ఉన్న వేరా సి. రూబిన్ అబ్జర్వేటరీ ఈ అద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరించింది. ఈ ఒక్క ఫోటోలోనే ఏకంగా 5 లక్షలకు పైగా గెలాక్సీలు, 50,000 కంటే ఎక్కువ నక్షత్రాలు అత్యంత స్పష్టంగా దర్శనమిస్తున్నాయి.

2 గిగాపిక్సెల్ కెమెరా అద్భుతం:

ఈ అరుదైన చిత్రాన్ని సాధించడం సాధారణ విషయం కాదు. దీని కోసం రూబిన్ అబ్జర్వేటరీకి చెందిన 3.2 గిగాపిక్సెల్ (320 కోట్ల పిక్సెల్స్) సామర్థ్యం కలిగిన బృహత్తర ఎల్‌ఎస్‌ఎస్‌టీ (LSST) కెమెరాను, 8.4 మీటర్ల వెడల్పు ఉన్న సిమోని సర్వే టెలిస్కోప్‌ను ఉపయోగించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే మసక వెలుగును సైతం స్పష్టంగా క్యాప్చర్ చేసేందుకు, ఈ కెమెరా తీసిన వందలాది ఫోటోలను ప్రత్యేక సాంకేతికత ద్వారా ఒకదానిపై ఒకటి అమర్చి డిజిటల్‌గా అనుసంధానించారు. దీనివల్ల విశ్వంలో ఇప్పటివరకు చూడని వింతలు వెలుగులోకి వచ్చాయి.

కాస్మోస్ ఫీల్డ్ ప్రత్యేకత:

ఈ చిత్రంలో కనిపిస్తున్న అంతరిక్ష భాగాన్ని కాస్మోస్ ఫీల్డ్ అని పిలుస్తారు. గత 20 ఏళ్లకు పైగా శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంపై దృష్టి సారించారు. మన క్షీరదార గెలాక్సీకి చెందిన ధూళి, నక్షత్రాల సాంద్రత ఇక్కడ తక్కువగా ఉండటం వల్ల, శతాబ్దాల నాటి సుదూర ఖగోళ నిర్మాణాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా స్పష్టంగా చూడవచ్చు. ఇందులో స్పైరల్, ఎలిప్టికల్ గెలాక్సీలతో పాటు విశ్వం ప్రారంభ సమయానికి చెందిన పురాతన ఎరుపు రంగు గెలాక్సీలు కూడా దర్శనమిచ్చాయి.

ఇవి కూడా చదవండి

Galaxy Discovery

విశ్వ ఆవిర్భావ రహస్యాల ఛేదన దిశగా…

అంతరిక్షంలో ఎంత లోతుగా పరిశీలిస్తే, కాలంలో అంత వెనక్కి వెళ్ళినట్లే లెక్క. అందువల్ల, కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గెలాక్సీలు విశ్వం ఎలా ఉద్భవించింది, గెలాక్సీలు ఎలా రూపుదిద్దుకున్నాయనే విషయాలను అర్థం చేసుకోవడానికి దోహదపడతాయి. అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (NSF), ఎనర్జీ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా చేపట్టిన 10 ఏళ్ల సుదీర్ఘ మిషన్‌లో భాగంగా ఈ పరిశోధన సాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ కెమెరా ద్వారా సూపర్‌నోవా వంటి అరుదైన ఖగోళ సంఘటనలను నమోదు చేసి విశ్వాంతరాళపు మరిన్ని రహస్యాలను వెలికితీస్తామని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us