AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పండుగకు సింపుల్‌గా, షార్ట్ టైంలో చేసుకునే చెక్క గారెలు..ఇలా చేస్తే నూనె అస్సలు పీల్చవు, నెలరోజులైన కరకరలాడుతూ

తెలంగాణ వ్యాప్తంగా బోనాల సందడి కొనసాగుతోంది. పండుగ వేళ ప్రతి ఇంట్లోనూ నాన్‌వెజ్‌ వంటకాలతో పాటుగా రకరకాల పిండి వంటకాలు సైతం చేస్తుంటారు. సాంప్రదాయ పిండి వంటకాలైన చెక్క గారెలు సరిగ్గా కుదరక గట్టిగా లేదా మెత్తగా అవుతుంటాయి. దీనికి పరిష్కారంగా సగ్గుబియ్యం ఉపయోగించారంటే.. మీ ఇంట్లో చేసిన చెక్క గారెలు అద్భుతమైన రుచిని, కరకరలాడే క్రిస్పీనెస్‌ను అందిస్తాయి. నూనె తక్కువగా పీల్చుకుని, నెల రోజుల పాటు కరకరలాడుతూ నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఈ పండుగకు సింపుల్‌గా, షార్ట్ టైంలో చేసుకునే చెక్క గారెలు..ఇలా చేస్తే నూనె అస్సలు పీల్చవు, నెలరోజులైన కరకరలాడుతూ
Crispy Chekkalu Recipe
Jyothi Gadda
|

Updated on: Aug 01, 2026 | 2:04 PM

Share

పండుగల సమయాల్లో లేదా సాయంత్రం వేళ టీ టైమ్ స్నాక్‌గా మన ఇళ్లల్లో ఎక్కువగా చేసుకునే వంటకాల్లో చెక్కలు ఒకటి. వీటినే పప్పు చెక్కలు లేదా కట్టె గారెలు అని కూడా అంటారు. ఇవి అందరికీ ఎంతో ఇష్టమైనప్పటికీ, చాలామందికి ఇవి చేయడం పెద్ద సవాలుగా మారుతుంది. కొన్నిసార్లు గట్టిగా వచ్చి పన్ను విరిగేలా ఉంటే, మరికొన్నిసార్లు మెత్తబడిపోయి కరకరలాడవు. అలాంటి సమస్య లేకుండా ఏమాత్రం నూనె పీల్చకుండా, ఎంతో గుల్లగా, క్రిస్పీగా వచ్చే సగ్గుబియ్యం చెక్కలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

బియ్యప్పిండి – అర కిలో

సగ్గుబియ్యం – 6 టేబుల్ స్పూన్లు (నీటిలో నానబెట్టినవి)

ఇవి కూడా చదవండి

పచ్చిమిర్చి – 10

అల్లం – అంగుళం ముక్క

వెల్లుల్లి రెబ్బలు – 15

జీలకర్ర – 1 టీస్పూన్

ధనియాలు – 4 టీస్పూన్లు

తెల్ల నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు

కరివేపాకు తరుగు – 2 టేబుల్ స్పూన్లు

కారం – 1 టీస్పూన్

ఉప్పు – రుచికి సరిపడా

వేడి నూనె – 7 నుండి 8 టేబుల్ స్పూన్లు

నూనె – డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:

ముందుగా మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. చివరగా ధనియాలు వేసి మరోసారి లైట్‌గా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి బేషన్‌లో బియ్యప్పిండిని తీసుకుని అందులో రుబ్బిన మసాలా పేస్ట్, ఉప్పు, కారం, నువ్వులు, నానబెట్టిన సగ్గుబియ్యం, కరివేపాకు వేయాలి. ఇప్పుడు బాగా కాగిన వేడి నూనెను పిండిలో పోసి గరిటెతో కలపాలి. చల్లారాక చేత్తో పిండి అంతటికీ నూనె పట్టేలా రబ్ చేస్తూ కలపాలి. ఈ టిప్ వల్ల చెక్కలు నూనె పీల్చకుండా ఎంతో క్రిస్పీగా వస్తాయి.

ఆ తర్వాత కొద్దికొద్దిగా గోరువెచ్చని నీటిని పోస్తూ పిండిని మెత్తని ముద్దలా కలుపుకుని, మూతపెట్టి 5 నిమిషాలు పక్కన ఉంచాలి. పిండిని చిన్న ఉండలుగా చేసుకుని, నూనె రాసిన పాలిథిన్ కవర్ లేదా బటర్ పేపర్‌పై ఉంచి ఫ్లాట్‌గా ఉండే బాక్స్ లేదా గ్లాస్‌తో పల్చగా చెక్కల ఆకారంలో ఒత్తుకోవాలి. మరోవైపు, కడాయిలో నూనె వేడిచేసి, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చెక్కలను రెండు వైపులా బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించాలి.

అంతే! నోరూరించే కరకరలాడే సగ్గుబియ్యం చెక్కలు రెడీ! ఇవి చల్లారాక ఎయిర్ టైట్ స్టీల్ డబ్బాలో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు తాజాదనంతో నిల్వ ఉంటాయి. మరెందుకు లేట్‌.. వెంటనే మొదలుపెట్టేయండి.. మటన్‌, చికెన్‌ తో పాటుగానే బోనాల స్పెషల్ గారెల టేస్ట్‌తో మీ ఇంటిల్లిపాదిని అదరగొట్టేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us