AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton: ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి.. ఈ సీక్రెట్ ట్రిక్స్ మీకోసమే..

ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఉదయాన్నే మటన్ షాపుల ముందు నిలబడి వందలు పెట్టి మరీ మాంసం కొంటుంటారు. అయితే ఎర్రగా కనిపించిన ప్రతి మటన్ తాజాదే అనుకుంటే మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసినట్లే.. కొంతమంది రోజుల తరబడి ఫ్రిడ్జ్‌లలో దాచిన నిల్వ మాంసాన్ని ఫ్రెష్ పేరుతో అంటగట్టేస్తుంటారు. మరి మీరు కొనేది తాజా మటనేనా లేక కుళ్లిపోయినదా అని చిటికెలో పసిగట్టే ఈ రహస్యాలు తెలుసుకోండి..

Mutton: ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి.. ఈ సీక్రెట్ ట్రిక్స్ మీకోసమే..
How To Identify Fresh Mutton
Krishna S
|

Updated on: Oct 03, 2026 | 8:38 PM

Share

సండే వచ్చిందంటే నాన్‌వెజ్ ప్రియులకు మటన్ ఉండాల్సిందే. తెల్లవారుజాము నుంచే మాంసం దుకాణాల ముందు గంటల తరబడి నిలబడి మరీ కొంటుంటారు. అయితే కిలో ధర విషయంలో బేరాలాడే జనాలు, ఆ మాంసం ఎంతవరకు స్వచ్ఛమైనది అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. రంగు చూసి మురిసిపోతే, కొన్నిసార్లు ఫ్రీజర్లలో పెట్టి తీసిన పాత మాంసం లేదా నాసిరకం సరుకు చేతికి చిక్కే ప్రమాదం ఉంది. ఇలాంటి బాక్టీరియా పట్టిన మాంసం వల్ల కడుపునొప్పి, డయేరియా వంటి జీర్ణకోశ సమస్యలు వస్తాయి. అందుకే మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఒరిజినల్ తాజా మటన్‌‌ను చిటికెలో కనిపెట్టే చిట్కాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

చేత్తో తాకితేనే సగం తెలిసిపోతుంది..

మాంసం నాణ్యతను తెలుసుకోవడానికి మీ వేళ్లే పెద్ద పరికరం. ముక్కపై చేతితో కాస్త నొక్కి చూడండి. స్ప్రింగ్ లాగా వెంటనే పైకి లేస్తే అది తాజా మేక మాంసం. అలా కాకుండా గుంట పడిపోయినా లేదా చేతికి జిగటగా అంటుకుంటున్నా ఆ మాంసం ఇప్పటికే పాడైపోవడం మొదలైందని గుర్తించి కొనకండి.

పింక్ కలర్ ఉందా? గమనించండి

తాజా మేక మాంసం ముదురు ఎరుపు లేదా లేత గులాబీ రంగులో మెరుపుతో ఉంటుంది. పాతబడిన కొద్దీ గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి బూడిద లేదా గోధుమ రంగులోకి మారిపోతుంది. రంగు తగ్గిన మాంసాన్ని దుకాణదారులు ఏవో మాటలు చెప్పి అంటగట్టే ప్రయత్నం చేసినా తీసుకోకూడదు.

బరువు కోసం నీటి మాయాజాలం..

కొన్ని దుకాణాల్లో మాంసం బరువు తూగేందుకు నీటిని పీల్చేలా చేస్తారు. ముక్కల్లో నుంచి ధారగా నీరు కారుతున్నా, మాంసం ఉంచిన ట్రేలో నీళ్లు ఎక్కువగా చేరినా అది మోసపూరిత సరుకు కావొచ్చు. సహజమైన మాంసంలో ఉండే తేమ వేరు, ఇలా నీళ్లతో నింపిన మాంసం వేరు.

వాసనలో తేడా వస్తే వదిలేయండి

మంచి మటన్‌కు ఎలాంటి అసహ్యకరమైన వాసన ఉండదు. ముక్కు దగ్గరకు తీసుకువెళ్లినప్పుడు పులిసిన వాసన గానీ, విచిత్రమైన గాటు వాసన గానీ వస్తే ఆ మాంసంలో సూక్ష్మజీవులు చేరిపోయాయని అర్థం.

కొవ్వు రంగు ముఖ్యం

మటన్ మీద ఉండే కొవ్వు భాగం స్వచ్ఛమైన తెలుపు రంగులో గట్టిగా ఉండాలి. ఒకవేళ అది పసుపు రంగులోకి మారినా, ఎముకలు జిగురుగా మారినా అది ఎక్కువ కాలం నిల్వ ఉంచిన లేదా రోగగ్రస్థ పశువుల మాంసమయ్యే అవకాశం ఉంది.

Follow Us
ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..
ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..
ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి
ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి
ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!
ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!
విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
పళ్లు తోముకున్నా నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
పళ్లు తోముకున్నా నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
శ్రీకాంత్, ఊహల ప్రేమకథ ఎలా మొదలయ్యిందో తెలుసా..
శ్రీకాంత్, ఊహల ప్రేమకథ ఎలా మొదలయ్యిందో తెలుసా..
కుండీ ఉంటే చాలు.. బాల్కనీ నిండా గుత్తులు గుత్తులుగా టమాటా పండ్లు
కుండీ ఉంటే చాలు.. బాల్కనీ నిండా గుత్తులు గుత్తులుగా టమాటా పండ్లు
ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా?..ఈ మిస్టేక్ చేయొద్దు
ఆకుకూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినా పాడవుతున్నాయా?..ఈ మిస్టేక్ చేయొద్దు
నోట్లోవేస్తే వెన్నెలా కరిగిపోయే గులాబ్ జామున్.. సూపర్ టిప్స్‌తో
నోట్లోవేస్తే వెన్నెలా కరిగిపోయే గులాబ్ జామున్.. సూపర్ టిప్స్‌తో
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పండక్కి ముందే షాక్..
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పండక్కి ముందే షాక్..