AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. ఈ ప్రాంతాల్లో కుండపోత.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్..

తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని సరూర్‌నగర్ 11.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Telangana: హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. ఈ ప్రాంతాల్లో కుండపోత.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్..
Heavy Rains In Telangana
Krishna S
|

Updated on: Aug 04, 2026 | 7:55 AM

Share

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జలమయమైన ప్రాంతాల్లో హైడ్రా, జీహెచ్‌ఎంసీ మన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు నీటిని తొలగించే చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా తూర్పు, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాల్లో కుండపోత వర్షం నమోదైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా సరూర్‌నగర్ ప్రాంతంలో 11.3 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. దాని సమీపంలోని అలకాపురి కాలనీలో 10.9 సెం.మీ. వర్షం కురవగా, ఎల్‌బీ నగర్‌ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద 9.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అంతేకాకుండా బర్కాస్ ఈఎస్‌ఎస్, చంద్రాయణగుట్ట : 8.4 సెం.మీ., ఉప్పల్ మండలం బండ్లగూడ: 8.3 సెం.మీ., సౌత్ హస్తినాపురం: 8.1 సెం.మీ., రాక్‌టౌన్ కాలనీ: 8.0 సెం.మీ., వనస్థలిపురం ఎన్‌జీఓ కాలనీ : 8.0 సెం.మీ., ఇబ్రహీంపట్నం: 7.1 సెం.మీ., కాప్రా GHMC ఆఫీస్: 7.0 సెం.మీ., మైలార్‌దేవ్‌పల్లి: 6.7 సెం.మీ., పీర్జాదిగూడ: 5.7 సెం.మీ., గచ్చిబౌలి- 5.7 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల వారీగా వర్షపాతం

కామారెడ్డి జిల్లా: నాగిరెడ్డిపేట మండలంలో అత్యధికంగా 6.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

మెదక్ జిల్లా: పాపన్నపేటలో 6.0 సెం.మీ., కౌడిపల్లిలో 4.8 సెం.మీ., మెదక్ టౌన్‌లో 4.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: చిట్యాలలో 4.1 సెం.మీ., భూపాలపల్లిలో 3.5 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.

మహబూబ్‌నగర్ జిల్లా: గండీడ్‌లో 3.7 సెం.మీ., హన్వాడలో 3.0 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

రాజన్న సిరిసిల్లా – ఇతర జిల్లాలు: బోయినపల్లిలో 3.3 సెం.మీ., వనపర్తిలో 2.6 సెం.మీ., ములుగులో 2.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

వాతావరణ శాఖ హెచ్చరికలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల రానున్న రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంత ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Follow Us