గుంటూరు GGH నుండి రిమాండ్ ఖైదీ అజిత్ కుమార్ పరారయ్యాడు. అనారోగ్య కారణాలతో మూడు రోజుల క్రితం జిజిహెచ్ కు తరలించబడిన అజిత్, చికిత్స పొందుతూ పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకున్నాడు. తెనాలిలో అరెస్ట్ అయిన ఇతడిని రేపల్లె సబ్ జైలుకు తరలించారు. గతంలో ఒంగోలులో కూడా ఇదే విధంగా పారిపోయాడని పోలీసులు తెలిపారు.