శ్రీరామనవమి రోజున తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ముండ్రు పద్మావతి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. నలుగురు దుండగులు ఒంటరిగా ఉన్న పద్మావతిని తాళ్లతో కట్టేసి 160 గ్రాముల బంగారు ఆభరణాలను, సుమారు 30 లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు. దొంగతనానికి ముందు కిచెన్లో కోడిగుడ్లు వండుకుని తినడం విడ్డూరం. ఈ ఘటన డీఎస్పీ కార్యాలయానికి సమీపంలో జరిగింది.