ఏపీ బీజేపీలో మూడు గ్రూపులు..ఆ కీలక నేతల మౌనం.. TV9 క్రాస్‌ఫైర్‌లో పీవీఎన్ మాధవ్ కీలక కామెంట్స్..
ఏపీ బీజేపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయా? టీడీపీ బ్యాచ్, వైసీపీ బ్యాచ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? వీటన్నింటికీ మించి.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని బీజేపీ రక్షిస్తోందా? ఇలాంటి అనేక హాట్ క్వశ్చన్స్‌కు TV9 క్రాస్ ఫైర్ వేదికగా ఏపీ బీజేపీ చీఫ్ పి.వి.ఎన్. మాధవ్ సూటిగా సమాధానాలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అంతర్గత వ్యవహారాలపై వస్తున్న అనేక వదంతులకు ఏపీ బీజేపీ చీఫ్ పి.వి.ఎన్. మాధవ్ చెక్ పెట్టారు. TV9 క్రాస్ ఫైర్‌లో పార్టీలో విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా ఖండించారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని, అదే సమయంలో తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు నిలబడాల్సిందేనని స్పష్టం చేశారు. బీజేపీలో టీడీపీ గ్రూప్, వైసీపీ గ్రూప్, ఒరిజినల్ బీజేపీ గ్రూప్ అనే మూడు విభాగాలు ఉన్నాయన్న వాదనను మాధవ్ తోసిపుచ్చారు. ‘‘ఇది కేవలం బయటి వ్యక్తులు లేదా ప్రత్యర్థి పార్టీలు సృష్టించిన వాతావరణం మాత్రమే. వ్యక్తిగత అనుబంధాలు ఉండవచ్చు కానీ పార్టీ లక్ష్యం దగ్గరకు వచ్చేసరికి అందరం ఒకే తాటిపై పని చేస్తున్నాం’’ అని ఆయన వివరించారు. జీవీ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు తమకు అప్పగించిన బాధ్యతలను జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
జగన్‌ను రక్షించడం లేదు
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని బీజేపీ రక్షిస్తోందన్న విమర్శలపై మాధవ్ ఘాటుగా స్పందించారు. ‘‘గత ప్రభుత్వంలో చేసిన తప్పులకు జగన్ జైల్లో ఉండాల్సిందే.. కానీ అరెస్ట్ చేయాలంటే పక్కా ఆధారాలతో కూడిన కేసు ఉండాలి. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ వంటి కేసుల్లో విచారణ జరుగుతోంది. ప్రధాన సూత్రధారులను పట్టుకునే ప్రక్రియలో భాగంగా ఆధారాలు లభించిన తర్వాత చట్టం తన పని తాను చేస్తుంది. బీజేపీ ఆయన్ను కాపాడుతోందన్నది కేవలం కొందరి భావన మాత్రమే’’ అని స్పష్టం చేశారు.
మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్
సర్ప్రైజ్ ఇచ్చిన కొడుకు.. సంతోషంతో తల్లి కన్నీళ్లు
కుక్క కోసం మంటల్ని లెక్క చేయక.. ప్రాణాలకు తెగించిన యువతి
కాటేసిన పాముతో నేరుగా ఆసుపత్రికి.. వృద్ధుడి సాహసం
క్లాస్ రూమ్‌లో ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్.. కట్ చేస్తే
ఫిట్స్ వచ్చి బైక్‌తో పడిపోయిన వ్యక్తి..కాపాడబోయిన రైతుకు షాక్
కాలేజ్ బాత్రూమ్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్

