Balakrishna : ఆ హీరోయిన్ను తీసుకోవడం బ్లండర్ మిస్టేక్.. బాలకృష్ణ సినిమా పై నెటిజన్ పోస్ట్.. గోపిచంద్ రియాక్షన్ ఇదే..
నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో భారీ గ్యాంగ్ స్టర్ డ్రామాలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోపై అభిమానులలో మంచి హైప్ ఉంది. ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలకు అభిమానుల్లో ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు బాలయ్య. ఇటీవలే అఖండ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఒకవైపు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తూనే.. మరోవైపు వరుస సినిమాలతో నటుడిగా అలరిస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. మాస్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: అలాంటి హీరోను నా జీవితంలో చూడలేదు.. ఆయన వల్లే నా జీవితం మారిపోయింది.. తనికెళ్ల భరణి..
ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కానుండడంతో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ ప్రాజెక్టులో యంగ్ బ్యూటీ డింపుల్ హయాతిని మరో కథానాయిక పాత్ర కోసం ఎంపిక చేసిందట చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుండగా.. మరో హీరోయిన్ గా డింపుల్ ను ఎంపిక చేశారట. అయితే ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. తనదైన స్టైల్లో స్పందించారు డైరెక్టర్ గోపిచంద్.
ఎక్కువమంది చదివినవి : Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..
“మంచి హైప్ ఉన్న సినిమాను చెడగొట్టడం ఎలానో #NBK111 మేకర్స్ ని చూసి బాగా నేర్చుకోవచ్చు. డింపుల్ హయాతిని హీరోయిన్ గా తీసుకోవడం బ్లండర్ మిస్టేక్.. ఆమె బదులు రవీనా టండన్ ని తీసుకుంటే బాగుండేది.. ” అంటూ ట్వీట్ చేశాడు ఓ నెటిజన్. దీనికి డైరెక్టర్ గోపిచంద్ రియాక్ట్ అవుతూ.. “మీకేమన్నా చెప్పారా ఎవరైనా.. నేను అయితే ఎవరికీ చెప్పలేదండి” అంటూ మహేష్ బాబు డైలాగ్ షేర్ చేశారు. దీంతో ఈ సినిమా డింపుల్ హయాతి హీరోయిన్ అనే వార్తలపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో సముద్రఖని కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?
https://t.co/qSP7PTXug8 pic.twitter.com/rqmOPRCgJ3
— Gopichandh Malineni (@megopichand) March 29, 2026
View this post on Instagram
ఎక్కువమంది చదివినవి : Cinema : హీరో ముసలోడు అని కొనేవాడు రాలేదు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
