AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kohli Catch Drop : కోహ్లీ ఈజీ క్యాచ్ డ్రాప్.. స్టేడియంలో నవ్వు ఆపుకోలేకపోయిన అనుష్క శర్మ

Kohli Catch Drop : మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. ఫీల్డింగ్‌లో అతను చిరుతపులిలా పరుగెత్తుతూ అసాధ్యమైన క్యాచ్‌లను సైతం సుసాధ్యం చేస్తాడు. కానీ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 18వ ఓవర్లో ఒక వింత జరిగింది. భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని అనికేత్ వర్మ లాంగ్ ఆన్ దిశగా గాలిలోకి లేపాడు.

Kohli Catch Drop : కోహ్లీ ఈజీ క్యాచ్ డ్రాప్.. స్టేడియంలో నవ్వు ఆపుకోలేకపోయిన అనుష్క శర్మ
Anushka Sharma
Rakesh
|

Updated on: Mar 29, 2026 | 12:23 PM

Share

Kohli Catch Drop : ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే హై డ్రామా చోటుచేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన ఈ పోరులో రికార్డులతో పాటు కొన్ని సరదా సంఘటనలు కూడా వెలుగుచూశాయి. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో ఎంతో చురుగ్గా ఉండే విరాట్ కోహ్లీ, ఒక అత్యంత సులువైన క్యాచ్‌ను వదిలేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ పొరపాటు కంటే, ఆ సమయంలో స్టాండ్స్‌లో ఉన్న అతని భార్య అనుష్క శర్మ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఆ ఒక్క క్యాచ్.. అందరిలోనూ ఆశ్చర్యం

మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. ఫీల్డింగ్‌లో అతను చిరుతపులిలా పరుగెత్తుతూ అసాధ్యమైన క్యాచ్‌లను సైతం సుసాధ్యం చేస్తాడు. కానీ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 18వ ఓవర్లో ఒక వింత జరిగింది. భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని అనికేత్ వర్మ లాంగ్ ఆన్ దిశగా గాలిలోకి లేపాడు. బంతి నేరుగా కోహ్లీ చేతుల్లోకి వచ్చింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఆ బంతి విరాట్ చేతుల్లో నుంచి జారి కిందపడిపోయింది. గాల్లో ఉన్న బంతిని పట్టడంలో కోహ్లీ ఎప్పుడూ తడబడడు, కానీ ఈసారి మాత్రం బంతి అతని చేతులకు తగిలి తొడను తాకుతూ నేలపాలైంది. స్టేడియంలో ఉన్న అభిమానులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

అనుష్క రియాక్షన్ అదిరిపోయింది

ఈ క్యాచ్ డ్రాప్ అయిన వెంటనే కెమెరాలు స్టాండ్స్‌లో కూర్చున్న అనుష్క శర్మ వైపు మళ్ళాయి. తన భర్త అంత ఈజీ క్యాచ్‌ను ఎలా వదిలేశాడో అని ఆశ్చర్యపోతూనే, అనుష్క నవ్వు ఆపుకోలేకపోయింది. ఆమె పడి పడి నవ్వుతున్న దృశ్యాలు టీవీ స్క్రీన్లపై కనిపించడంతో సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురుస్తోంది. “భార్య ముందే పరువు పోయింది కోహ్లీ” అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. అయితే, విరాట్ ఆ తర్వాత వెంటనే తేరుకుని అదే అనికేత్ వర్మ క్యాచ్‌ను మరోసారి పట్టి తన తప్పును సరిదిద్దుకున్నాడు.

డఫీ బౌలింగ్.. పడిక్కల్ విధ్వంసం

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే, న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. తన ఐపీఎల్ అరంగేట్రంలోనే 22 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీసి సన్‌రైజర్స్ నడ్డి విరిచాడు. ఇక బ్యాటింగ్‌లో దేవదత్ పడిక్కల్ తూఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. పడిక్కల్ ఆడిన తీరు చూస్తుంటే ఈ సీజన్‌లో అతను భారీ స్కోర్లు సాధిస్తాడనే నమ్మకం కలిగింది.

బ్యాట్‌తో కోహ్లీ బదులు.. ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

ఫీల్డింగ్‌లో చేసిన చిన్న పొరపాటును కోహ్లీ తన బ్యాటింగ్‌తో కవర్ చేశాడు. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా 38 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా కేవలం 12 బంతుల్లో 31 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఫలితంగా ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని, ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే భారీ విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడంతో పాటు నెట్ రన్ రేట్ కూడా అద్భుతంగా మెరుగుపరుచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us