AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. అమెరికా కరెన్సీపై ట్రంప్‌ సంతకం

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. అమెరికా కరెన్సీపై ట్రంప్‌ సంతకం

Phani CH
|

Updated on: Mar 29, 2026 | 12:55 PM

Share

అమెరికా 165 ఏళ్ల కరెన్సీ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం త్వరలో డాలర్ నోట్లపై కనిపించనుంది. 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలో ఉన్న అధ్యక్షుడి సంతకం కరెన్సీపై ఉండటం ఇదే మొదటిసారి. జూన్‌లో మొదటి 100 డాలర్ల నోట్లు ముద్రించబడతాయి. ఇది అమెరికా ఆర్థిక చరిత్రలో ఒక సంచలనం.

అమెరికా తన 165 ఏళ్ల నాటి సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో ముద్రించనున్న పేపర్ కరెన్సీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకాన్ని చేర్చనున్నట్లు యూఎస్ ట్రెజరీ శాఖ గురువారం ప్రకటించింది. అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవ ప్రణాళికల్లో భాగంగా ఈ చారిత్రక మార్పుకు శ్రీకారం చుట్టారు. అధికారంలో ఉన్న అధ్యక్షుడి సంతకాన్ని కరెన్సీపై చేర్చడం ఇదే మొదటిసారి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. యూఎస్ కరెన్సీ నోట్లపై సంతకం చేయబోతున్న తొలి అధ్యక్షుడిగా ఆయన నిలవబోతున్నారు. నిజానికి అమెరికాలో 1861 నుంచి ఒక సంప్రదాయం కొనసాగుతోంది. కరెన్సీ నోట్లపై కేవలం ట్రెజరర్ మరియు ట్రెజరీ కార్యదర్శి సంతకాలు మాత్రమే ఉంటాయి. గత 165 ఏళ్లుగా ఏ అధ్యక్షుడూ నోట్లపై సంతకం చేయలేదు. ఇప్పుడు ట్రంప్ ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, తన సంతకంతో నోట్లను విడుదల చేయబోతున్నారు. ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌తో కలిసి ట్రంప్ సంతకం చేసిన మొదటి 100 డాలర్ల నోట్లను ఈ ఏడాది జూన్‌లో ముద్రించనున్నారు. అమెరికా సాధించిన చరిత్రాత్మక విజయాలను గుర్తుచేసుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గమని స్కాట్ బెసెంట్ అభిప్రాయపడ్డారు. కేవలం నోట్లు మాత్రమే కాకుండా, స్వాతంత్ర్య వేడుకల గుర్తుగా ట్రంప్ ముఖచిత్రంతో కూడిన స్మారక నాణేన్ని కూడా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా ఆర్థిక చరిత్రలో ఇదొక సంచలన నిర్ణయంగా నిలిచిపోనుంది. అమెరికన్ ట్రెజరర్ బ్రాండన్ బీజ్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ట్రంప్ ఇందుకు పూర్తి అర్హులని వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంపర్‌ ఆఫర్‌.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!

రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్‌.. ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌

పాడేరులో అద్భుతం ‘మినీ కాశ్మీర్’గా మారిన అరకు లోయ

AC Price: భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ప్రధాన కారణాలు ఇవే

వైరల్‌ కోతికి గర్ల్ ఫ్రెండ్ దొరికింది.. కొత్త స్నేహం, కొత్త జీవితం

Follow Us