AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KitKat: 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లతో వెళ్తున్న భారీ ట్రక్కు చోరీ.. అసలు ఏం జరిగింది?

KitKat: సుమారు 12 టన్నుల బరువున్న కిట్‌క్యాట్ చాక్లెట్ల లోడ్‌తో వెళ్తున్న ఒక భారీ ట్రక్కు అదృశ్యమైంది. ఈ దొంగతనం కారణంగా రాబోయే ఈస్టర్ పండుగ సమయంలో మార్కెట్లో కిట్‌క్యాట్ కొరత ఏర్పడే అవకాశం ఉందని కంపెనీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

KitKat: 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లతో వెళ్తున్న భారీ ట్రక్కు చోరీ.. అసలు ఏం జరిగింది?
Kitkat
Subhash Goud
|

Updated on: Mar 29, 2026 | 12:50 PM

Share

KitKat: ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ కంపెనీ నెస్లే (Nestlé) కి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన ‘కిట్‌క్యాట్’ (KitKat) చాక్లెట్లకు సంబంధించి ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. యూరప్‌లో సుమారు 12 టన్నుల బరువున్న కిట్‌క్యాట్ చాక్లెట్ల లోడ్‌తో వెళ్తున్న ఒక భారీ ట్రక్కు అదృశ్యమైంది. ఈ దొంగతనం కారణంగా రాబోయే ఈస్టర్ పండుగ సమయంలో మార్కెట్లో కిట్‌క్యాట్ కొరత ఏర్పడే అవకాశం ఉందని కంపెనీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఏం జరిగింది?

నెస్లే కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 4,13,793 యూనిట్ల కిట్‌క్యాట్ చాక్లెట్లతో నిండిన ఒక ట్రక్కు రవాణాలో ఉండగా అదృశ్యమైంది. ఈ మొత్తం చాక్లెట్ల బరువు దాదాపు 12 టన్నులు. ఈ ట్రక్కు ప్రొడక్షన్ యూనిట్ నుండి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు వెళ్తుండగా దారిలోనే మాయమైపోయింది.

LPG Gas Booking: ఎల్‌పీజీ గ్యాస్‌ బుకింగ్‌లో ఇలాంటివి అస్సలు నమ్మకండి.. సులభమైన పద్దతులు మీకు తెలుసా?

ఇటలీ నుండి పోలాండ్ ప్రయాణంలో..

ఈ భారీ లోడ్ ఇటలీలోని సెంట్రల్ ప్రాంతం నుండి పోలాండ్ వైపు వెళ్తోంది. మార్గమధ్యలో పలు యూరోపియన్ దేశాలకు ఈ చాక్లెట్లను సరఫరా చేయాల్సి ఉంది. అయితే ట్రక్కు ఖచ్చితంగా ఎక్కడ మాయమైందనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇప్పటివరకు ఆ ట్రక్కుకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లభించకపోవడం గమనార్హం. చాక్లెట్లతో వెళ్తున్న ఈ ట్రక్కు చోరీకి గురై ఉంటుందని కంపెనీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

LPG Booking: దేశంలో గ్యాస్‌ బుకింగ్‌ నిబంధనలు మారాయని మీకు తెలుసా? ఇలా చేస్తే సిలిండర్‌ అందదు!

పండుగ వేళ సరఫరాపై ప్రభావం

ముఖ్యంగా ఈస్టర్ వంటి పెద్ద పండుగ సమయంలో చాక్లెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. సరిగ్గా పండుగకు ముందే ఇంత పెద్ద మొత్తంలో స్టాక్ మాయమవ్వడం వల్ల మార్కెట్లో సరఫరా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల వినియోగదారులు ఇబ్బంది పడతారని నెస్లే హెచ్చరించింది. చోరీకి గురైన ఈ చాక్లెట్లు అనధికారికంగా (Grey Market) లేదా లోకల్ మార్కెట్లలో తక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉందని కంపెనీ అనుమానిస్తోంది. దీనిపై స్థానిక పోలీసులు, సప్లై చైన్ భాగస్వాములతో కలిసి విచారణ జరుపుతున్నారు.

బ్యాచ్ కోడ్ ద్వారా గుర్తింపు

ప్రతి కిట్‌క్యాట్ బార్‌పై ఒక ప్రత్యేకమైన ‘బ్యాచ్ కోడ్’ (Batch Code) ఉంటుందని, దాని ద్వారా చోరీకి గురైన ఉత్పత్తులను సులభంగా గుర్తించవచ్చని కంపెనీ తెలిపింది. ఎక్కడైనా అనుమానాస్పదంగా చాక్లెట్లు కనిపిస్తే వాటిని స్కాన్ చేసి వెంటనే సమాచారం అందించాలని కోరింది. ఈ ఘటన సప్లై చైన్ భద్రతపై ప్రశ్నలను లేవనెత్తడమే కాకుండా, పండుగ సీజన్‌లో కంపెనీకి పెద్ద ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. రాబోయే రోజుల్లో యూరప్ మార్కెట్లలో కిట్‌క్యాట్ కొరత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us