Tollywood : అప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.. కుర్రాళ్ల ట్రెండ్ ఐకాన్.. 10 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో..
90వ దశకంలో దక్షిణాదిలో అతడు స్టార్ హీరో. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన అందగాడు. అప్పట్లో ఇండస్ట్రీలోనే చాక్లెట్ బాయ్.. అమ్మాయిల కలల రాకుమారుడు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ హీరో.. ఇప్పుడు పదేళ్లకు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకీ ఈ హీరో ఎవరో తెలుసా.. ?

ఒకప్పుడు దక్షిణాదిలో అతడు రొమాంటిక్ హీరో. ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అంతేకాదు.. 90వ దశకంలో అమ్మాయిల డ్రీమ్ బాయ్. అతడి స్టైల్, యాక్టింగ్ కు కుర్రాళ్లు ఫిదా. అంతగా యూత్ ను అట్రాక్ట్ చేసిన ఈ హీరో.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. స్టార్ హీరోగా వరుస సినిమాలతో అలరించిన అతడు.. ఆ తర్వాత కొన్నాళ్లు పెట్రోల్ బంకులో పనిచేశారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత సినీరంగంలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకీ ఈ హీరో ఎవరో తెలుసా.. ? అతడే అబ్బాస్. ఈ తరానికి ఈ పేరు తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు 90’s యూత్ ఫేవరెట్ హీరో.
హీరో అబ్బాస్.. కాదల్ దేశం (తెలుగులో ప్రేమదేశం) సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. హీరోగా ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో తన నటనతో అమ్మాయిలను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత తమిళంలో వీఐపీ, పూవేలి, పడయప్ప, మలబార్ పోలీస్, కందుకొండెన్ కందుకొండెన్, మిన్నలే, ఆనందం, పమ్మల్ కే సమ్మంతం, కాదల్ వైరస్ వంటిచిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ గా మారారు. అయితే కెరిర్ మంచి ఫాంలో ఉండగానే సెకండ్ హీరోగానూ నటించాడు. అదే సమయంలో అబ్బాస్ నటించిన సినిమాలు సైతం ప్లాప్ అయ్యాయి. దీంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి.
సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆయన సినిమా పరిశ్రమను విడిచిపెట్టి పదేళ్ల క్రితం ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అబ్బాస్.. ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడ్డానని.. పెట్రోల్ బంక్ అటెండెంట్‌గా, మెకానిక్‌గా, టాక్సీ డ్రైవర్‌గా పనిచేశానని అన్నారు. ప్రస్తుతం ఐటీ జాబ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. దాదాపు పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. జీవీ ప్రకాష్ నటిస్తున్న ఓ సినిమాలో అబ్బాస్ కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి మరియా రాజా ఇలంచెలియన్ దర్శకత్వం వహిస్తుండగా.. గౌరీ ప్రియ కథానాయికగా నటిస్తుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.

Abbas Ne
ఇవి కూడా చదవండి:
Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!
Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..



