Puneeth Rajkumar: పునీత్ అంత్యక్రియలకు టాలీవుడ్ స్టార్స్..బెంగళూరుకు పయనం..
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో భారతీయ సినిమా పరిశ్రమ మొత్తం శోకసంద్రంలో...
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో భారతీయ సినిమా పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. అప్పు ఇక మన మధ్య లేరనే దుర్వార్తను ఎవరూ అంత సులభంగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విధ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు సోషల్ మీడియా వేదికగా పునీత్‌కు నివాళి అర్పిస్తున్నారు. ఇక కన్నడ పవర్‌స్టార్‌తో టాలీవుడ్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఆయనను కడసారి చూసేందుకు పలువురు టాలీవుడ్ నటులు బెంగళూరుకు బయలుదేరనున్నారు. అక్కడి కంఠీరవ స్టేడియంలోని పునీత్ పార్థీవ దేహానికి నివాళి అర్పించనున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ బెంగళూరు బయలుదేరగా..మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ మధ్యాహ్నం నుంచి బెంగళూరు వెళ్లనున్నారు.
నరేష్, శివబాలాజీ కూడా పునీత్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ విషయం పంచుకున్నారు. నిన్న ఉదయం తన ఇంట్లో జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు పునీత్. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే బెంగళూరు విక్రమ్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. యావత్ భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు లక్షలాది మంది అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ ఆయన ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
Also Read: