Jugnu Challenge: జుగ్ను ఛాలెంజ్‌కు అనుష్క స్టెప్పులు..వైరలవుతోన్న వీడియో..

ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌, లెమన్‌ ఫేస్‌ ఛాలెంజ్‌ తరహాలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో 'జుగ్ను ఛాలెంజ్‌' ట్రెండింగ్‌లో ఉంది. ప్రముఖ ర్యాప్‌ సింగర్‌..

Jugnu Challenge:  జుగ్ను ఛాలెంజ్‌కు అనుష్క స్టెప్పులు..వైరలవుతోన్న వీడియో..
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Oct 30, 2021 | 1:47 PM

ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌, లెమన్‌ ఫేస్‌ ఛాలెంజ్‌ తరహాలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘జుగ్ను ఛాలెంజ్‌’ ట్రెండింగ్‌లో ఉంది. ప్రముఖ ర్యాప్‌ సింగర్‌ బాద్షా రూపొందించిన ఈ డ్యాన్స్‌ ఛాలెంజ్‌లో ‘ఛంపి స్టెప్‌’, ‘టిల్ట్‌ మాస్టర్‌’, ‘డ్రిబ్లింగ్‌ బాల్‌’, ‘ఖండాలా స్టెప్‌’ అని నాలుగు దశలుంటాయి. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు వీటికి అనుగుణంగా కాలు కదపాల్సి ఉంటుంది. అలియా భట్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా, రణ్‌వీర్‌ సింగ్, కత్రినా కైఫ్‌, వరుణ్‌ ధావన్‌ తదితరులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాదు తమ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది.

మేడమ్‌…మీ డ్యాన్స్‌ సూపర్బ్‌… తాజాగా మరో బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ ‘జుగ్ను’ డ్యాన్స్‌ ఛాలెంజ్‌ను స్వీకరించింది. అద్భుతంగా డ్యాన్స్‌ చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘చాలా రోజుల తర్వాత అనుష్కా డ్యాన్స్‌ను చూశాం’, ‘మేడమ్‌…మీ గ్రేస్‌ ఏ మాత్రం మారలేదు..డ్యాన్స్‌ సూపర్బ్‌’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 2018లో విడుదలైన ‘జీరో’ సినిమాలో చివరిసారిగా కనిపించింది అనుష్క. ఆ తర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించలేదు. అయితే ప్రొడ్యూసర్‌గా కొన్ని విభిన్న సినిమాలను తెరకెక్కించి విజయాలు అందుకుంది.

Also Read:

Puneeth Rajkumar: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ చివరి ట్వీట్ ఇదే…

Puneeth Rajkumar Death: “ఈ వార్త నిజం కాకూడదు”.. పునీత్ రాజ్ కుమార్ మృతికి సంతాపం తెలుపుతున్న సినీప్రముఖులు..

Rajinikanth Health Bulletin: సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్ విడుదల..

చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!