AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ చివరి ట్వీట్ ఇదే..

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు.

Puneeth Rajkumar: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ చివరి ట్వీట్ ఇదే..
Puneeth Rajkumar
Ram Naramaneni
|

Updated on: Oct 29, 2021 | 4:53 PM

Share

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు. నటుడిగా నేపథ్య గాయడకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యతగా, ఆడియో కంపెనీ ఓనర్‌గా, నిర్మాతగా ఎన్నో రంగాల్లో కన్నడ ఇండస్ట్రీకి సేవలందించారు పునీత్ రాజ్‌కుమార్‌. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్‌కుమార్ వెండితెర మీద తిరుగులేని స్టార్ డమ్‌ సాధించారు. కన్నడ నాట అత్యథిక కలెక్షన్లు సాధించిన హీరోగా, అత్యథిక పారితోషికం అందుకున్న హీరోగానూ రికార్డ్ సృష్టించారు. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో 29 సినిమాలు చేశారు పునీత్‌ రాజ్‌కుమార్‌. చివరగా యువరత్న సినిమాలో నటించారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేయటంతో పాటు తెలుగు ఆడియన్స్‌కు చేరవయ్యేందుకు టాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం హోంబలే బ్యానర్‌లో ద్విత్వ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు పునీత్‌.

భజిరంగి‌-2 టీమ్‌కు బెస్ట్ విషెస్ చెబుతూ పునీత్‌ లాస్ట్‌ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ హీరోగా నటించారు. పునీత్ మరణం అనంతరం ఆయన సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

కన్నడ స్టార్‌, నెంబర్‌ వన్‌ హీరో కావడంతో ఫ్యాన్స్‌ షాక్‌కు గురవుతారన్న ప్రచారంతో ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతుడగానే.. కర్నాటక వ్యాప్తంగా అలర్ట్‌ ప్రకటించిన అధికారులు.. సినిమా థియేటర్లను మూసి వేశారు. అటు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అలర్ట్‌ ప్రకటించి.. భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. పునీత్‌కు చికిత్స అందించిన ఆస్పత్రి పరిసరాల్లోనూ ఫ్యాన్స్‌ను కంట్రోల్‌ చేయడం పోలీసుల వల్ల కాలేదు. ముందుకు తోసుకు వచ్చిన ఫ్యాన్స్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకొచ్చారు. అటు.. డెడ్‌ బాడీని ఫ్యాన్స్‌ సందర్శనార్ధం కంఠీరవ స్టేడియంకు తరలించేందుకు ముందుగానే రోడ్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్‌ను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.

Also Read: సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్ విడుదల..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్