Rajinikanth Health Bulletin: సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్ విడుదల..

సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

Rajinikanth Health Bulletin: సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్ విడుదల..
Rajinikanth
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 29, 2021 | 3:34 PM

సూపర్‌ స్టార్  రజినీకాంత్‌ హెల్త్‌ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించిన వైద్యులు.. అవసమైన ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. త్వరలోనే రజినీకాంత్‌ను హాస్పిటల్‌ నుంచి‌ డిశ్చార్జ్ చేయనున్నట్లు కావేరి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

Rajinikanth Health Update

ప్రస్తుతం రజినీకాంత్‌కు 72ఏళ్లు. ఓ వైపు వయసు మీద పడడం.. మరోవైపు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో షూటింగ్‌లు కూడా తగ్గించుకున్నారు. ఇక పార్టీ పేరు ప్రకటించి కూడా వెనక్కి తగ్గారు. దీని వెనుక కూడా అనారోగ్య సమస్యలేనని తెలుస్తోంది. రజినీ లెటెస్ట్ మూవీ అన్నాత్తే.. తెలుగులో పెద్దన్నగా వస్తోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. నవంబర్‌ 4న రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.

అసలు రజినీకాంత్‌కు ఏమైంది. గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారో చూద్దాం.

2011లో ఎమెసిస్‌ అనే అనారోగ్య సమస్యతో ఇబ్బందిపడ్డారు రజినీకాంత్. తీసుకున్న ఆహారం వాంతుల రూపంలో బయటకు రావడమే ఎమెసిస్‌. ఈ వ్యాధి ఆయన్ను చాలా బాధించింది. ఎమెసిస్‌ ట్రీట్‌మెంట్ సమయంలో బ్రాంకైటిస్ బారిన పడ్డారు రజినీ. బ్రాంకైటిస్‌తో కొన్నాళ్లు ఐసీయూలోనే చికిత్స తీసుకున్నారు.  సింగపూర్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకున్న అనంతరం కోలుకున్నారు.

(శ్వాసకోశ నాళాల్లో కలిగే మార్పులతో ఆయాసం, దగ్గు, కఫం, జ్వరం, నీరసం లాంటివి మాటిమాటికీ ఇబ్బంది పెడుతుంటాయి. ఈ వ్యాధిని బ్రాంకైటిస్‌ ఒక్కోసారి అది దీర్ఘకాలం కనిపించే వ్యాధిగా మారుతుంది. దీనితో రోగ నిరోధకశక్తి తగ్గడం, ఆస్తమా లాంటి పరిణామాలు సంభవిస్తాయి)

అన్నాత్తే షూటింగ్ కోసం హైదరాబాద్‌ వచ్చిన సమయంలో కూడా రజినీకాంత్‌ సిక్‌ అయ్యారు. ఆ డిటెల్స్‌ చూద్దాం.

2020, డిసెంబర్ 13న షూటింగ్ నిమిత్తం రజినీకాంత్‌ హైదరాబాద్‌కు వచ్చారు. ఆర్‌ఎఫ్‌సీ విలేజ్‌ సెట్‌లో అన్నాత్తే షూటింగ్‌లో పాల్గొన్నారు. 2020, డిసెంబర్ 29 వరకు అన్నాత్తే షూటింగ్ ప్లాన్ చేశారు. అయితే యూనట్‌లో కొంతమందికి కరోనా పాజిటివ్‌ రావడంతో.. షూటింగ్‌ నిలిపివేశారు. 2020, డిసెంబర్ 22న హై బీపీతో అపోలోలో అడ్మిట్ అయ్యారు.

ప్రతి ఏటా  అమెరికాకు రజినీ

2021, జూన్‌ 19న ప్రత్యేక విమానంలో అమెరికాకు వెళ్లారు రజినీకాంత్.  సాధారణ వైద్య పరీక్షల కోసమేనని ప్రకటన విడుదల చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలో రజినీకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరిగింది. అప్పటినుంచి ప్రతి ఏడాది చెకప్‌ కోసం ఆయన అమెరికాకు వెళ్తున్నారు.

Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి.. షాక్‏లో సినీ పరిశ్రమ..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే