Puneeth Rajkumar: మరణించే ముందు రాత్రి బర్త్ డే పార్టీలో పునీత్.. జీవితం అనూహ్యమైంది అంటూ చివరి వీడియో వైరల్

Puneeth Rajkumar: జీవితం క్షణ భంగురం అన్న పెద్దల మాటను మళ్ళీ  కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం గుర్తు చేసింది.  పునీత్ గుండె నొప్పితో..

Puneeth Rajkumar: మరణించే ముందు రాత్రి బర్త్ డే పార్టీలో పునీత్.. జీవితం అనూహ్యమైంది అంటూ చివరి వీడియో  వైరల్
Puneeth Raj Kumar
Follow us
Surya Kala

|

Updated on: Oct 30, 2021 | 8:27 AM

Puneeth Rajkumar: జీవితం క్షణ భంగురం అన్న పెద్దల మాటను మళ్ళీ  కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం గుర్తు చేసింది.  పునీత్ గుండె నొప్పితో బాధపడుతూ శుక్రవారం (అక్టోబర్ 29)న తుది శ్వాస విడిచారు. పునీత్ మరణంతో శాండల్ వుడ్ మాత్రమే కాదు.. యావత్ సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.  పునీత్ తో తమ బంధాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు విలపిస్తున్నారు. పునీత్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పునీత్ గురువారం రాత్రి సంగీత దర్శకుడు నటుడు గురుకిరణ్ పుట్టినరోజు వేడుకలో  పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గురు కిరణ్ పుట్టిన రోజు వేడుకలో పునీత్ సరదాగా గడిపిన వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

పునీత్ రాజ్ కుమార్ గురువారం రాత్రి బెంగళూరులో  మ్యూజిక్ డైరెక్టర్ గురుకిరణ్ పుట్టిన రోజు వేడుక్కి హాజరయ్యారు. ఈ వేడుకలో సుమారు రెండు గంటలకు పైగా బర్త్ డే పార్టీలో ఉన్నారని గురు కిరణ్ చెప్పారు. ఆయన చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారని, మాతో చాలా ఉత్సాహంగా గడిపారని  వివరించారు. బర్త్ డే పార్టీ వేడుకలో పునీత్ తో పాటు, నటుడు అనిరుధ్ సహా అనేక మంది శాండల్ వుడ్ నటీనటులు పాల్గొన్నారు. పార్టీకి వచ్చిన నటీనటులందరినీ పలకరిస్తూ పునీత్ చాలా సంతోషంగా గడిపారని గురు కిరణ్ చెప్పారు.  పునీత్ పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు నా స్నేహితుల్లో మొదటి స్థానంలో ఉండే వ్యక్తి పునీత్.. మేము నిన్న రాత్రి సంతోషముగా గడిపాడు..అప్పుడు నెక్స్ట్ ఏమిటో నేను గ్రహించలేదు.. నీవు లేవనే విషాద వార్త విన్నాను.. దేవుడు నిన్ను తన దగ్గరకు తీసుకున్నారు.. మేము నిన్ను కోల్పోయాము.. జీవితం అనూహ్యమైంది అంటూ .#LifeIsUnpredictable @PuneethRajkumar”తో కామెంట్స్ చేశారు గురికిరణ్.

పునీత్ రాజ్‌కుమార్ చివరి వీడియో :

శుక్రవారం 4 గంటలకు పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయాన్ని బెంగళూరులోని ఆయన నివాసానికి తరలించారు. చివరిసారిగా పునీత్ ను చూడడానికి నటీనటులు, అభిమానులు క్యూ కట్టారు. తుది వేడికోలు పలికేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా