AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Malavika: అలా చెప్పినందుకు హీరో షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మాళవిక..

గతంలో సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా రాణించిన చాలామంది నటీమణులు ఇప్పుడు వెండితెరకు దూరంగా ఉంటున్నారు.

Actress Malavika: అలా చెప్పినందుకు హీరో షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన మాళవిక..
Chala Bagundi
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2022 | 7:37 AM

Share

గతంలో సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా రాణించిన చాలామంది నటీమణులు ఇప్పుడు వెండితెరకు దూరంగా ఉంటున్నారు. పెళ్లి తర్వాత చాలా మంది హీరోయిన్లుగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఇంట్లోనే ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే వారు స్క్రీన్ ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు వరుస ప్రాజెక్టులతో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మాళవిక (Malavika).. చాలా కాలం తర్వాత బుల్లితెరపై ప్రత్యేక్షమయ్యింది.

చాలా బాగుంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యింది నటి మాళవిక. తెలుగులోనే కాకుండా.. తమిళం, కన్నడ, మలయాళం ఇలా దక్షిణాది చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. మాళవిక చివరిసారిగా రజినీ కాంత్, నయన్ కలిసి నటించిన చంద్రముఖి సినిమాలో కనిపించింది. ఇక చాలా కాలం తర్వాత తాజాగా అలీతో సరదాగా షోలో సందడి చేసింది మాళవిక. ఈ ఎపిసోడ్‏కు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు నిర్వాహుకులు. ఈ సందర్భంగా మాళవిక పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

అందులో తెలుగు సినిమాలు చూస్తున్నారా అని అలీ అడగ్గా.. ఇటీవల పుష్ప సినిమా చూశానని.. అందులో సమంత చేసినట్లు స్పెషల్ సాంగ్ ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు. అలాగే ఈవీవీ సత్యనారాయం దర్శకత్వం వహించి చాలా బాగుంది సినిమాలో హీరో శ్రీకాంత్‏కు .. తనకు ఓ సాంగ్ విషయంలో గొడవ జరిగిందని తెలిపింది. ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ కావడంతో నాకు అంత కంఫర్ట్ లేదని చెప్పాను. దీంతో శ్రీకాంత్ షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయారు. అలాగే ఈ సినిమాలో రేప్ సీన్ లో నటించినందుకు ఇప్పటికీ చాలా డిస్ట్రబ్ గా అనిపిస్తుంది. అనవసరంగా చేశానా అని అనిపిస్తుంది. అలాగే హిందీలో కూడా సీయూ ఎట్ 9 సినిమాలో ఎక్కువగా ఎక్స్‏పోజింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఇంట్లో పేరెంట్స్ కోప్పడ్డారు.. ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా అంటూ చెప్పుకొచ్చింది మాళవిక.

Also Read: Jayaprada: జయప్రద ఇంట తీవ్ర విషాదం.. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన సీనియర్ నటి

Brahmanandam Birthday: సినిమా తెర నుంచి డిజిటల్ పేజీల వరకూ బ్రహ్మాండమంత ఆనందం!

Panja Vaisshnav Tej : మెగా హీరో సినిమానుంచి మూడోవ సినిమా మొదటి సింగిల్ రెడీ అయ్యిందంటా..