AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Sipligunj: బిగ్‌బాస్‌లోకి వెళ్లే ముందే ప్లాన్‌ చేశారా? రతికతో పర్సనల్‌ ఫొటోల లీక్‌పై సింగర్‌ రాహుల్ ఫైర్‌

ప్రస్తుతం హౌజ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న టాప్‌ కంటెస్టెంట్‌ ఎవరంటే ఠక్కున వచ్చే గుర్తుకు వచ్చే పేరు.. రతికా రోజ్‌. బిగ్ బాస్ 7 తెలుగులోకి పదో కంటెస్టెంట్‍గా అడుగు పెట్టిన ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ షోకు కావాల్సిన కంటెంట్‌ను బాగానే అందిస్తోంది. మొదట రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో చనువుగా వ్యవహరించింది. అయితే నామినేషనలో మాత్రం అతడిని గట్టిగా దెబ్బేసింది. ఆ తర్వాత ప్రిన్స్‌ యావర్‌తో కలిసిపోయింది. అతనికి సపోర్టుగా మాట్లాడింది.

Rahul Sipligunj: బిగ్‌బాస్‌లోకి వెళ్లే ముందే ప్లాన్‌ చేశారా? రతికతో పర్సనల్‌ ఫొటోల లీక్‌పై సింగర్‌ రాహుల్ ఫైర్‌
Rahul Sipligunj, Rathika
Basha Shek
|

Updated on: Sep 21, 2023 | 12:20 PM

Share

ప్రముఖ టాలీవుడ్‌ సింగర్‌ రాహుల్‌ సిప్లీగంజ్ ఫైర్‌ అయ్యారు. ఎప్పుడో గతంలో దిగిన కొన్ని పర్సనల్‌ ఫొటోలు సడెన్‌గా ఇంటర్‌నెట్‌లో లీక్‌ కావడంపై తీవ్రంగా మండిడుతున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో అతను షేర్‌ చేసిన పోస్ట్‌ ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరి రాహుల్‌ ఫైర్‌ అవ్వడానికి కారణమేంటి? అసలు ఆ ఫొటోల సంగతేంటి అనే వివరాల్లోకి వెళితే.. బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ పోటాపోటీగా సాగుతోంది. ఇప్పటికే మూడో వారంలోకి ప్రవేశించిందీ రియాలిటీ షో. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లో అడుగపెట్టగా ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యారు. ఇక ప్రస్తుతం హౌజ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న టాప్‌ కంటెస్టెంట్‌ ఎవరంటే ఠక్కున వచ్చే గుర్తుకు వచ్చే పేరు.. రతికా రోజ్‌. బిగ్ బాస్ 7 తెలుగులోకి పదో కంటెస్టెంట్‍గా అడుగు పెట్టిన ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ షోకు కావాల్సిన కంటెంట్‌ను బాగానే అందిస్తోంది. మొదట రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో చనువుగా వ్యవహరించింది. అయితే నామినేషనలో మాత్రం అతడిని గట్టిగా దెబ్బేసింది. ఆ తర్వాత ప్రిన్స్‌ యావర్‌తో కలిసిపోయింది. అతనికి సపోర్టుగా మాట్లాడింది. ఆ వెంటనే మళ్లీ పవర్‌ అస్త్ర కంటెండర్‌కు ప్రిన్స్‌ అనర్హుడంటూ షాక్‌ ఇచ్చింది. పాపం పెద్ద మనసుతో రతికను క్షమించాడు ప్రిన్స్‌ . దీంతో మళ్లీ అతనితో ఒకే ప్లేటులో తింటూ హౌజ్‌లో రొమాన్స్‌ నడిపిస్తోందీ అందాల తార. మొత్తానికి హౌస్‌లో లవ్‌ ట్రాకులు నడుపుతూ, టాస్క్‌లు, గేమ్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ చేస్తోంది రతిక.

ఇలాంటి పనులు చేయవద్దు..

ఇదిలా ఉంటే ఆ మధ్యన తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ గుర్తుకొస్తున్నాడంటూ హౌజ్‌లో ఎమోషనల్‌ అయ్యింది రతిక. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంది. అతను గుర్తొస్తే తన మెదడు మొద్దుబారిపోతుందని వాపోయింది. పైగా అతను సింగర్‌ కూడా అని హింట్‌ ఇచ్చింది. దీంతో రతికతో ప్రేమాయణం నడిపిన సింగర్‌ ఎవరబ్బా అని ఆలోచనలో పడిపోయారు. అదే సమయంలో ఫోక్‌ సింగర్‌ రాహుల్‌ సిప్లీగంజ్‌తో రతిక క్లోజ్‌గా ఉన్న ఫొటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. అయితే ఉన్నట్లుండి ఈ ఫొటోలు ఆన్‌లైన్‌ లీక్‌ కావడంపై టాలీవుడ్ సింగర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి పనులు చేసేముందు ఒక్కసారి ఆలోచించుకోవాలంటూ సోషల్‌ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్టు షేర్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

రతికతో సింగర్ రాహుల్ 

అందరికీ గతం ఉంటుంది..

నాకు ఒక సందేహం ఉంది. ఆరేళ్ల తర్వాత ఒకరి మొబైల్‌లో ఉన్న పర్సనల్ ఫొటోలు ఒక్కసారిగా ఎలా ఇంటర్నెట్‌లోకి వచ్చాయి. ఇది వాళ్లు లోపలికి వెళ్లే ముందు ప్రీ ప్లాన్డ్‌గా చేసి పనేనా? గాయ్స్‌.. మీరంతా దీనికి సమాధానం తెలసుకోవాలి. ఎందుకంటే అసలు వాస్తవాలు అందరికీ తెలియాలి కదా. నాకు, మరొకరి లైఫ్‌కు ఎలాంటి సంబంధం లేదు. అది అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా.. ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ అండ్‌ ఫ్రెండ్స్‌ ఉంటారు. ఇలాంటివి చూసినప్పుడు వారు మానసిక క్షోభకు గురవుతారు. ప్రతి ఒక్కరి జీవితంలో గతం ఉంటుంది. అలాగే ప్రజెంట్‌ కూడా ఉంటుంది. అందుకే.. అవగాహ లేకుండా ఎవరిని పడితే వారిని జడ్జ్‌ చేయకండి. దీనిని అర్థం చేసుకున్నవారికి థ్యాంక్స్‌. ఇక ఎవరైతే నెగెటివిటీని ప్రచారం చేసుకుంటున్నారో వాళ్లకు ఆల్‌ ది బెస్ట్‌’ అని రాసుకొచ్చాడు రాహుల్‌. మొత్తానిని రతిక పేరు చెప్పకుండానే ఆమెపై తీవ్రంగా మండిపడ్డాడీ టాలీవుడ్ సింగర్‌. ప్రస్తుతం రాహుల్ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Rahul Sipligunj Post

Rahul Sipligunj Post

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.