Bigg Boss 7:ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ కంటెస్టెంట్.. బ్యాగ్ సర్దాల్సిందే.. మీరు ఊహించారా..?
Bigg Boss Telugu: అమర్ దీప్ చౌదరి టాప్ ఓటింగ్‌తో దూసుకుపోతున్నాడు. ఆ తర్వాతి ప్లేసులో ప్రిన్స్ యావర్ మంచి ఓట్స్ సాధించాడు. అతడికి సింపతీ పెరిగింది. తెలుగు రాకపోయినా జనాలు ఓన్ చేసుకోవడం మొదలెట్టారు. ఇక ప్రియాంక థర్డ్ ప్లేసులో ఉండగా ఉండగా.. గౌతమ్ కృష్ణ నాలుగో స్థానంలో ఉన్నాడు. మరి డేంజర్ జోన్‌లో ఉంది ఎవరు..? తెలుసుకుందాం పదండి...
బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ జోరుగా సాగుతుంది. ఉల్టా పుల్టా సీజన్‌లో బిగ్ బాస్ ఇచ్చే ట్విస్టులు కిక్ ఇస్తున్నాయి. ఇప్పటికే రెండు వారాలు గడిచాయి. కిరణ్ రాథోడ్, షకీలా ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం ఓటింగ్ ఫుల్ ఫ్లోలో ఉంది. గౌతమ్ కృష్ణ, శుభశ్రీ రాయగురు, రతిక రోజ్, దామిని, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అమర్ దీప్.. ఈ ఏడుగురు ఈవారం నామినేషన్స్‌లో ఉన్నారు. నటుడు, డాక్టర్ గౌతమ్ కృష్ణ తొలుత డేంజర్ జోన్‌లో ఉంటాడని అందరూ భావించారు. అయితే గౌతమ్ ఈ మధ్య వాయిస్ పెంచాడు. లాస్ట్ ఎపిసోడ్‌లో శోభా శెట్టితో భారీ డైలాగ్ వార్ నడిచింది. ఇప్పుడు మనోడు కొంత అగ్రెసీవ్ అవుతున్నాడు. సో.. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. దీంతో దామిని డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. అమర్ దీప్ చౌదరి టాప్ ఓటింగ్‌తో దూసుకుపోతున్నాడు. ఆ తర్వాతి ప్లేసులో ప్రిన్స్ యావర్ మంచి ఓట్స్ సాధించాడు. అతడికి సింపతీ పెరిగింది. తెలుగు రాకపోయినా జనాలు ఓన్ చేసుకోవడం మొదలెట్టారు. ఇక ప్రియాంక థర్డ్ ప్లేసులో ఉండగా ఉండగా.. గౌతమ్ కృష్ణ నాలుగో స్థానంలో ఉన్నాడు. రతిక ఐదో స్థానంలో ఉంటే.. శుభ శ్రీ ఆరో స్థానానికి పరిమితమైంది. దామిని స్వల్ప ఓట్లతో అందరికంటే లీస్ట్‌లో ఉంది. సో.. ఈ ఓటింగ్ గనక ఇలాగే కంటిన్యూ అయితే మూడో వారంలో దామిని ఇంటి బాట పట్టక తప్పదు.
ఈ సీజన్ రేటింగ్ కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉంది. సుమారు 5. 1 కోట్ల ప్రేక్షకులు ఫస్ట్ వీక్ బిగ్ బాస్ షో చూశారని తెలిసింది. ఇక ఈ షో లాంఛ్ ఈవెంట్‌ను సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూశారని బిగ్ బాస్ నిర్వాహకులు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక ఈ షోకు 18.1 రేటింగ్ వచ్చిందని స్టార్ మా అనౌన్స్ చేసింది. లాస్ట్ సీజన్ అంతగా కిక్కు ఇవ్వకపోవడంతో.. ఈసారి ఉల్టా పుల్టా అంటూ మస్త్ మజా తీసుకువచ్చారు. ఓటింగ్ కూడా మారింది. ఒకరు ఒక్క ఓటు మాత్రమే వేయగలరు.
అమర్ దీప్‌కు ఎందుకు అంత ఓటింగ్….
నిజానికి అమర్ దీప్ పెద్దగా గేమ్ ఆడిన దాఖలాలు లేవు. వాదనలు కూడా పెద్దగా లేవు. పాయింట్ మాట్లాడలేదు. అయినా టాప్ ఓటింగ్ ఉంది. అందుకు కారణం.. సీరియల్ బ్యాచ్ సపోర్ట్. అవును.. అతడిని సీరియల్ బ్యాచ్ అంతా గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. బయట గట్టిగానే పీఆర్ టీంని సెటప్ చేసుకుని వెళ్లాడని బయట టాక్ నడుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.