Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: ‘అలియా భట్‌ నా కూతురు లాంటిది’.. ఆ విమర్శలపై కరణ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో బంధుప్రీతి (నెపోటిజం)పై చర్చ జోరుగా సాగుతోంది . సినిమా ఇండస్ట్రీలో ముందు నుంచీ ఈ చర్చ ఉన్నప్పటికీ సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత మరింత ఊపందుకుంది. బంధుప్రీతితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నటీనటుల సినిమాలను తిరస్కరించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. ఇక బాలీవుడ్‌లో బంధుప్రీతిపై చర్చకు వచ్చినప్పుడల్లా కరణ్ జోహార్ పేరు వినిపిస్తూ ఉం ది. బాలీవుడ్‌లో నెపోటిజానికి ఆయనే బ్రాండ్‌ అంబాసిడర్‌ అని కామెంట్లు తరచూ వినిపిస్తుంటాయి

Alia Bhatt: 'అలియా భట్‌ నా కూతురు లాంటిది'.. ఆ విమర్శలపై  కరణ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌
Alia Bhatt, Karan Johar
Follow us
Basha Shek

|

Updated on: Sep 20, 2023 | 10:12 PM

గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో బంధుప్రీతి (నెపోటిజం)పై చర్చ జోరుగా సాగుతోంది . సినిమా ఇండస్ట్రీలో ముందు నుంచీ ఈ చర్చ ఉన్నప్పటికీ సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత మరింత ఊపందుకుంది.  సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన స్టార్ నటీనటుల వారసుల సినిమాలను తిరస్కరించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. ఇక బాలీవుడ్‌లో బంధుప్రీతిపై చర్చకు వచ్చినప్పుడల్లా కరణ్ జోహార్ పేరు వినిపిస్తూ ఉం ది. బాలీవుడ్‌లో నెపోటిజానికి ఆయనే బ్రాండ్‌ అంబాసిడర్‌ అని కామెంట్లు తరచూ వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో తనపై వస్తోన్న బంధుప్రీతి ఆరోపణలపై దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఘాటుగా స్పందించారు.’మీకు ఎలా కావాలంటే అలా నన్ను విమర్శించండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆశ్రిత పక్షపాతానికి నేను ఎప్పటికీ క్షమాపణ చెప్పను. నాకు ఏది సరైనదో అది చేస్తాను. నా సినిమాకు ఎవరు సరిపోతారో వాళ్లనే తీసుకుంటాను.అలా నేను ఎంచుకున్న నటీనటులు ఎవరైనా వ్యక్తి లేదా కుటుంబానికి సంబంధించినవారైతే నేను ఏమీ చేయలేను’ అంటూ తనపై వస్తోన్న విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు కరణ్‌ జోహార్‌. ఇక అలియా భట్ గురించి మాట్లాడుతూ..’అలియా భట్ నా మొదటి కూతురు లాంటిది. నేను ఆమెను చాలా ఆరాధిస్తాను. వ్యక్తిగత జీవితంలోనూ, పబ్లిక్ లైఫ్‌లోనూ ఆమె వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. అలియా భట్ నా జీవితంలో భాగమైపోయింది’ అని చెప్పకొచ్చారు కరణ్. కాగా అలియా భట్‌ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకు కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహించాడు. అయితే మహేష్ భట్ కూతురు కాబట్టి కరణ్ తన సినిమా కోసం ఆలియాను ఎంపిక చేసుకున్నాడని విమర్శలు వచ్చాయి.

కరణ్ జోహార్ చాలా మంది స్టార్ నటులు, నటీమణుల పిల్లలను చిత్ర పరిశ్రమలోకి తీసుకొచ్చారు. అలియా బట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, అనన్య పాండే, జాన్హవి కపూర్, తారా సుతారియా ఇలా చాలామందిని సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు. ఇప్పుడు సైఫ్ అలీఖాన్ కొడుకును కూడా కరణ్‌ జొహారే లాంచ్ చేయనున్నాడని సమాచారం. వీరితో పాటు మరికొందరు నటీనటుల పిల్లలను కరణ్ జోహార్ ఇండస్ట్రీలోకి తీసుకురానున్నరాని తెలుస్తోంది. కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ సినిమా కొన్ని రోజుల క్రితం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు కరణ్‌. అలాగే సౌత్‌లో కూడా కొన్ని సినిమాలను తెరకెక్కించే యోచనలో ఉన్నారీ స్టార్‌ డైరెక్టర్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి