Mayapetika OTT: ఓటీటీలో ‘మాయా పేటిక’కు సూపర్‌ రెస్పాన్స్‌.. పాయల్ సినిమాకు భారీ వ్యూస్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

ఇటీవల థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేని సినిమాలు ఓటీటీలో వచ్చాక దుమ్మురేపుతున్నాయి. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. గత వారం రిలీజైన రామబాణం, భోళాశంకర్‌ సినిమాలకు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో సూపర్‌ రెస్పాన్స్‌ వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు బిగ్‌ స్క్రీన్‌పై నిరాశపర్చినవే. ఇప్పుడు ఈ జాబితాలోకి మరొక చిన్న సినిమా చేరింది. బేబీ సినిమాతో క్రేజ్‌ తెచ్చుకున్న విరాజ్ అశ్విన్‌ హీరోగా నటించిన సినిమా మాయా పేటిక.

Mayapetika OTT: ఓటీటీలో 'మాయా పేటిక'కు సూపర్‌ రెస్పాన్స్‌.. పాయల్ సినిమాకు భారీ వ్యూస్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
MayaPetika Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 19, 2023 | 9:40 PM

ఇటీవల థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేని సినిమాలు ఓటీటీలో వచ్చాక దుమ్మురేపుతున్నాయి. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. గత వారం రిలీజైన రామబాణం, భోళాశంకర్‌ సినిమాలకు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో సూపర్‌ రెస్పాన్స్‌ వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు బిగ్‌ స్క్రీన్‌పై నిరాశపర్చినవే. ఇప్పుడు ఈ జాబితాలోకి మరొక చిన్న సినిమా చేరింది. బేబీ సినిమాతో క్రేజ్‌ తెచ్చుకున్న విరాజ్ అశ్విన్‌ హీరోగా నటించిన సినిమా మాయా పేటిక. ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌ ఇందులో హీరోయిన్‌గా నటించింది. జూన్‌ 30వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కాన్సెప్ట్‌ బాగున్నా సరైన ప్రమోషన్లు నిర్వహించకపోవడం, రీరిలీజుల ట్రెండ్‌ కొనసాగుతుండడంతో బాక్సాఫీస్‌ వద్ద ఓ మోస్తరు కలెక్షన్లు మాత్రమే సాధించింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో రికార్డు వ్యూస్‌ సొంతం చేసుకుంటోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ మాయా పేటిక డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్‌ 15 నుంచి ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంటోంది. తాజాగా మాయాపేటిక సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో 25 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్‌ను దాటేసింది. అదికూడా కేవలం నాలుగురోజుల్లోనే. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. ‘హీట్ ఎక్కిపోతుంది. 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ అంటే అంతేగా మరి’ అంటూ మాయాపేటిక కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది ఆహా.

మేశ్‌ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సునీల్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, శ్రీనివాసరెడ్డి, పృథ్వీ, హిమజ, శ్యామల తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరత్ చంద్రారెడ్డి, తారక్‍నాథ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. గుణ బాలసుబ్రమణియన్ స్వరాలు అందించగా, వెంకట ప్రభు ఎడిటర్‌గా వ్యవహరించారు. ఇక సినిమా విషయానికొస్తే.. మాయా పేటిక మొత్తం ఓ సెల్‌ఫోన్‌ చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌కు ప్రొడ్యూసర్‌ ఒక ఫోన్‌ ఇస్తాడు. దీని కారణంగా భర్తతో పాయల్‌కు గొడవలు తలెత్తుతాయి. దీంతో మొబైల్‌ను తన అసిస్టెంట్‌కు ఇస్తుంది. అలా చేతులు మారుతూ మారుతూ చివరకు పాకిస్థాన్‌ చేరుకుంటుంది ఆ ఫోన్‌. మరి ఆ మొబైల్‌ వల్ల విరాజ్‌, సిమ్రత్‌ కౌర్‌, శ్రీనివాసరెడ్డి, పృథ్వీరాజ్‌ల జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెలుసుకోవాలంటే మాయాపేటిక సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటిన మాయా పేటిక..

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.