Samajavaragamana: టీవీలో నవ్వుల నజరానా.. ఆ ఛానెల్‌లో టెలికాస్ట్‌ కానున్న ‘సామజవరగమన’.. ఎప్పుడంటే?

ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సినిమాల్లో సామజవరగమన ఒకటి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు నిర్మాతలకు కాసుల పంట పండించింది. రామ్‌ అబ్బరాజు తెరకెక్కించిన ఈ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో శ్రీ విష్ణు హీరోగా నటించాడు. బిగిల్‌ (తెలుగులో విజిల్‌) ఫేమ్‌ రెబ్బా మౌనికా జాన్‌ కథానాయిక.

Samajavaragamana: టీవీలో నవ్వుల నజరానా.. ఆ ఛానెల్‌లో టెలికాస్ట్‌ కానున్న 'సామజవరగమన'.. ఎప్పుడంటే?
Samajavaragamana Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 20, 2023 | 5:10 PM

ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సినిమాల్లో సామజవరగమన ఒకటి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు నిర్మాతలకు కాసుల పంట పండించింది. రామ్‌ అబ్బరాజు తెరకెక్కించిన ఈ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో శ్రీ విష్ణు హీరోగా నటించాడు. బిగిల్‌ (తెలుగులో విజిల్‌) ఫేమ్‌ రెబ్బా మౌనికా జాన్‌ కథానాయిక. వీకే నరేష్‌, సుదర్శన్‌ అయ్యంగార్‌, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్‌, ప్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఫస్ట్‌ షో నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, రవితేజ, సుమంత్‌, అడివిశేష్‌, నాగచైతన్య లాంటి స్టార్‌ హీరోలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. థియేటర్లలో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఆపై ఆహా ఓటీటీలోనూ రికార్డు వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఇలా థియేటర్లలో, ఓటీటీల్లో అదరగొట్టిన సామజవరగమన సినిమా ఇప్పుడు టీవీల్లోకి వచ్చేస్తోంది. స్టార్‌ మా ఛానెల్‌ ఈ మూవీ శాటిలైట్‌ రైట్స్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఆదివారం (సెప్టెంబర్‌ 24) సాయంత్రం 6 గంటలకు శ్రీ విష్ణు సినిమా ప్రసారం కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది స్టార్‌ మా ఛానెల్‌.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ దండా సామజవరగమన సినిమాను నిర్మించారు. గోపీ సుందర్‌ స్వరాలు సమకూర్చారు. ఇక సినిమా కథ విషయనికి వస్తే.. బాలు (శ్రీ విష్ణు), సరయు (రెబ్బా మౌనికా జాన్‌) ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే అనుకోని ప‌రిస్థితుల్లో బాలు ప్రేమించిన అమ్మాయి.. చెల్లెలిగా మారాల్సి వస్తుంది. మరి ఆ సమయంలో బాలు ఏం చేశాడు? ఆ స‌మ‌స్య నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? అనేది తెలుసుకోవాలంటే సామరవరగమన సినిమా చూడాల్సిందే. సినిమాలో నరేష్‌- శ్రీ విష్ణు కాంబోలో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ముఖ్యంగా డిగ్రీ పాస్ కావ‌డానికి తంటాలు ప‌డే వ్యక్తిగా సీనియ‌ర్ న‌రేష్ పాత్ర నవ్వులు పూయించింది. మరి థియేటర్లు, ఓటీటీలో ఈ సినిమాను చూడలేదా? అయితే టీవీల్లో చూసి కడుపుబ్బా నవ్వుకోండి.

ఇవి కూడా చదవండి

స్టార్ మా ఛానెల్ లో సామజవరగమన..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..