Rathika Rose: అమ్మా.. తల్లీ.. నీకో దండం.. ఇన్ని సీజన్స్‌లో నీలాంటి కంటెస్టెంట్‌ని చూడలేదు..

రతిక రోజ్ ప్రవర్తన మాత్రం బాబోయ్ తలనొప్పి తెప్పిస్తుంది. గత సీజన్‌లో గీతూ మాదిరిగా అతికి కేరాఫ్ అడ్రస్ అయ్యింది. గీతూ గేమ్‌లో కాస్త నిజాయితీ ఉంటుంది. ఈమె మాత్రం అలా కాదు.. కంటెంట్ కోసం ఏమైనా చేస్తుంది. కెమెరా అటెన్షన్ కోసం వెంపర్లాడుతుంది. ఎవరితో ఎప్పుడు పులిహోర కలుపుతుందో తెలీదు. ఎవరిని ఎప్పుడు నిండా ముంచేస్తుందో తెలీదు. ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Rathika Rose: అమ్మా.. తల్లీ.. నీకో దండం.. ఇన్ని సీజన్స్‌లో నీలాంటి కంటెస్టెంట్‌ని చూడలేదు..
Rathika Rose - Pallavi Prashanth
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 20, 2023 | 1:00 PM

బిగ్ బాస్ సీజన్ 7… టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతుంది. ఉల్టా పుల్టా సీజన్‌కు జనాలు కనెక్ట్ అయ్యారు. గత సీజన్ చప్పగా సాగడంతో.. ఈ సారి బిగ్ బాస్ యూనిట్ కూడా బాగా ఘాటు ఉండేలా అన్ని సెగ్మెంట్స్ ప్లాన్ చేశారు. ఎప్పటికప్పుడు ట్రాకులు మార్చేస్తూ.. హౌస్ మేట్స్ మధ్య అగ్గి రాజేస్తున్నారు. అయితే ముందుగా మాట్లాడుకుని వెళ్లారో ఏమో తెలియదు కానీ.. సీరియల్ బ్యాచ్ మాత్రం.. ఒకరికొకరు కొపరేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇక్కడ నిజంగా గేమ్ బాగా ఆడుతుంది ఎవరో చెప్పాలంటే ఖచ్చితంగా శివాజీ పేరే ముందు ఉంటుంది. ఆయన స్ట్రాటజీలు, ప్లానింగ్స్ మాములుగా లేవు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో ఫుల్‌గా తెలుసు. అయితే ఏదైనా ఇష్యూ జరిగితే మిగతావాళ్లని లైట్ తీసుకోమని చెబుతూ.. తాను మాత్రం సీరియస్‌గా తీసుకుంటున్నారు. రోజుకో ట్విస్ట్‌తో సీజన్‌ సాలిడ్‌గా సాగుతుంది.

అయితే రతిక రోజ్ ప్రవర్తన మాత్రం బాబోయ్ తలనొప్పి తెప్పిస్తుంది. గత సీజన్‌లో గీతూ మాదిరిగా అతికి కేరాఫ్ అడ్రస్ అయ్యింది. గీతూ గేమ్‌లో కాస్త నిజాయితీ ఉంటుంది. ఈమె మాత్రం అలా కాదు.. కంటెంట్ కోసం ఏమైనా చేస్తుంది. కెమెరా అటెన్షన్ కోసం వెంపర్లాడుతుంది. ఎవరితో ఎప్పుడు పులిహోర కలుపుతుందో తెలీదు. ఎవరిని ఎప్పుడు నిండా ముంచేస్తుందో తెలీదు. అసలు ఆమె  గేమ్ ప్లాన్ ఏంటి అన్నది కూడా అర్థం కావడం లేదు. మధ్య మధ్యలో తాను లవ్ ఫెయిల్యూర్ అంటూ సింపతీ కోసం ప్రయత్నాలు కూడా చేస్తుంది. అటు హౌస్‌లో ఒక్కరితో కూడా గుడ్ రిలేషన్ మెయింటైన్ చేసిన దాఖలాలు లేవు. మొదట పల్లవి ప్రశాంత్‌కు నిలువునా వెన్నుపోటు పొడిచింది. తాజాగా ప్రిన్స్ యావర్‌ను నిండా ముంచేసింది. నెక్ట్స్ శివాజీ లైన్‌లో ఉన్నారు. ఆయన్ను ఏ రకంగా పడేస్తుందో చూడాలి.

ఇక  ఈ సీజన్‌లో సందీప్ మాస్టర్ ఆటతీరు కాస్త పర్వాలేదనిపిస్తుంది. అమర్ ఆట ఆడటానికి ప్రయత్నిస్తున్నా.. అతను ఏం చేసినా.. మాట్లాడినా ముందు ప్రిపేర్ అయి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇక టేస్టీ తేజ.. శోభా శెట్టి కోసం బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాడా అనిపిస్తుంది ఇప్పుడు. ఆమెను సేవ్ చేయడానికి, ఆమె కంపెనీ ఇవ్వడానికి తప్పితే.. మనోడు పొడుస్తుంది అంటూ ఏం లేదు. ఇక ప్రియాంక జైన్.. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది. గౌతమ్, శుభ శ్రీ ఓకే అనిపించుకుంటున్నారు. దామిని కూడా తన మార్క్ ప్రవర్తనతో వీక్షకుల నోళ్లలో నానుతుంది. మిగతా వాళ్ల గురించి పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!