Bigg Boss Telugu7: ఇదేం శాడిజంరా అయ్యా? ప్రిన్స్‌ ముఖంపై పేడ నీళ్లు, గుడ్లు.. అక్కడ ఐస్‌ ముక్కలు వేసి మరీ..

బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ మూడో వారంలోకి ప్రవేశించింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లో అడుగపెట్టగా ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యారు. ఇక మూడో వారం నామినేషన్స్‌లో శుభశ్రీ, ప్రియాకం, దామిని, గౌతమ్, యావర్, రతిక, అమర్ దీప్ ఉన్నారు. కాగా నామినేషన్స్‌, టాస్కులు అంటూ హౌజ్‌మేట్ల మధ్య గొడవలు పెడుతూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే పనిలో ఉన్నాడు బిగ్‌బాస్‌. తాజాగా మరో టాస్క్‌తో దీనిని నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లాడు.

Bigg Boss Telugu7: ఇదేం శాడిజంరా అయ్యా? ప్రిన్స్‌ ముఖంపై పేడ నీళ్లు, గుడ్లు.. అక్కడ ఐస్‌ ముక్కలు వేసి మరీ..
Bigg Boss Telugu7
Follow us
Basha Shek

|

Updated on: Sep 20, 2023 | 8:43 PM

బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ మూడో వారంలోకి ప్రవేశించింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లో అడుగపెట్టగా ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యారు. ఇక మూడో వారం నామినేషన్స్‌లో శుభశ్రీ, ప్రియాకం, దామిని, గౌతమ్, యావర్, రతిక, అమర్ దీప్ ఉన్నారు. కాగా నామినేషన్స్‌, టాస్కులు అంటూ హౌజ్‌మేట్ల మధ్య గొడవలు పెడుతూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే పనిలో ఉన్నాడు బిగ్‌బాస్‌. తాజాగా మరో టాస్క్‌తో దీనిని నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లాడు. ప్రిన్స్ యావర్‌ ను పవర్‌ అస్త్ర పొందడానికి అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అతనికి మరోఅవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్‌. పవరాస్త్ర కంటెండర్‌కు తాను అర్హుడినేనని నిరూపించుకునేందుకు ఓ పెద్ద పరీక్షే పెట్టాడు. అదేంటంటే హౌజ్‌ మేట్స్ ఏం చేసినా స్టాండ్‌పై నుంచి ఉంచిన తల తీయకూడదని చెప్పారు. అయితే ఇదే సరైన సమయమనుకుని కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. ర‌తిక‌, దామిని, టేస్టీ తేజాలు యావ‌ర్ పోటీకి అన‌ర్హుడు అని నిరూపించేందుకు తమదైన శైలిలో ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా రతిక ప్రిన్స్‌ ముఖంపై గుడ్లు కొట్టి తన శాడిజాన్ని బయటపెట్టింది. అలాగే సింగర్‌ దామిని ప్రిన్స్‌ ముక్కులో ఈక‌లు పెట్టింది. దీనిని చూసిన శివాజీ ‘తప్పమ్మా’ అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఇవన్నీ మా ప్రయత్నాలు.. దయచేసి అడ్డురాకంటూ ఎదురుచెప్పిందీ బాహుబలి సింగర్‌.

దారుణంగా ప్రవర్తించినా.. ఓపికతోనే..

ఇక టేస్టీ తేజా దీనిని నెక్ట్స్‌లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఐస్ ముక్కలు తీసుకుని ప్రిన్స్‌ ప్యాంట్‌లో వేశారు. ఆ త‌రువాత ముగ్గురూ కలిసి పేడ నీళ్లను యావ‌ర్ ముఖం పై పోశారు. అయితే రతిక, దామిని, టేస్టీతేజా దారుణంగా ప్రవర్తించినప్పటికీ ప్రిన్స్‌ యావర్‌ ఎంతో ఓపికగానే ఉన్నాడు. మరీ ఈ టెస్టులో ప్రిన్స్‌ పాసయ్యాడా? పవర్‌ అస్త్రా పోటీదారుడిగా నిలవబోతున్నాడా? అన్నది మరికొన్ని గంటల్లో ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో చూడాల్సిందే. కాగా ఈ వారం మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

పాపం ప్రిన్స్ యానర్..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

ప్రిన్సే ఎందుకు టార్గెట్ అయ్యాడు?

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.