AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Season 7: ‘చిల్లర వేషాలు వేస్తే తొక్క తీస్తా..’ హద్దుల దాటిన శివాజీ మాటలు.. శోభ Vs గౌతమ్ బాహాబాహీ..

ఎపిసోడ్ మొదలవ్వగానే.. బ్రోకెన్ హార్ట్ తో చపాతీలు కాలుస్తూ కనిపించిన యావర్ ప్రిన్స్.. తను కంటెండర్ ఇష్టం లేదని చెప్పిన రతికను సర్‌ప్రైజింగ్‌లీ పామ్ పర్ చేస్తుంటారు. మరేం పర్లేదు అంటూ.. పెద్ద మనసు చేసుకుని మరీ.. ప్రిన్స్ కూల్‌గా ఉంటూ.. రతికకు చపాతీ తినిపిస్తుంటాడు. ఇక ఇది చూసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో పాటు.. చూస్తున్న బీబీ లవర్స్ కూడా ఒక్క సారిగా షాక్ అవుతారు..

Bigg Boss Season 7: 'చిల్లర వేషాలు వేస్తే తొక్క తీస్తా..' హద్దుల దాటిన శివాజీ మాటలు.. శోభ Vs గౌతమ్ బాహాబాహీ..
Bigg Boss 7
Subhash Goud
| Edited By: Rajeev Rayala|

Updated on: Sep 21, 2023 | 7:28 AM

Share

మండే నామినేషన్స్‌తో.. రంజుగా సాగిన బిగ్ బాస్ 7 ఆ మరుసటి ఎపిసోడ్‌తో.. మండే ఎపిసోడ్‌ అంత కాకపోయినా.. కాస్త ఎంటర్‌టైన్ అండ్ థ్రిల్లింగ్ గానే సాగింది. యావర్, అమర్ దీప్, శోభ మూడవ కంటెండర్స్‌గా ఎంపికయ్యారని చెప్పిన బిగ్ బాస్.. ఆ తరువాత వీరి ముగ్గిరిలో ఎవరు కంటెండర్ అవడం నచ్చలేదో.. కన్ఫెషన్‌ రూమ్‌లో చెప్పాలని కంటెస్టెంట్స్ ను కూడా ఆదేశించారు. అలా చెప్పిన ఫుటేజీని భయటపెట్టి.. హౌస్ మేట్స్ మధ్య చిచ్చు రగిల్చి మనకు డబుల్ ఇంటర్‌టైన్మెంట్ కలిగేలా చేస్తారు. ఇక ఈక్రమంలోనే ఈరోజు అంటే 18th ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..!

ఎపిసోడ్ మొదలవ్వగానే.. బ్రోకెన్ హార్ట్ తో చపాతీలు కాలుస్తూ కనిపించిన యావర్ ప్రిన్స్.. తను కంటెండర్ ఇష్టం లేదని చెప్పిన రతికను సర్‌ప్రైజింగ్‌లీ పామ్ పర్ చేస్తుంటారు. మరేం పర్లేదు అంటూ.. పెద్ద మనసు చేసుకుని మరీ.. ప్రిన్స్ కూల్‌గా ఉంటూ.. రతికకు చపాతీ తినిపిస్తుంటాడు. ఇక ఇది చూసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో పాటు.. చూస్తున్న బీబీ లవర్స్ కూడా ఒక్క సారిగా షాక్ అవుతారు.

ఇక కట్ చేస్తే.. అర్థరాత్రి ఒంటిగంటకు.. శివాజీ శివాలెత్తుతారు. తన పవరాస్త్రాను తీయడం వెనక ఎవడైతే.. ఎవతైతే ఉంటారో.. తన చేతిలో చచ్చారే అంటూ.. అరుస్తాడు. చిల్లర వేషాలు వేస్తే తొక్క తీసేస్తా అంటూ హౌస్ మేట్స్‌కు మాస్ వార్నింగ్ ఇస్తాడు. దీంతో ప్రియాంక శివాజీ మాటలకు కాస్త హర్టవుతుంది. తన మాటలు.. నచ్చడం లేదంటూ.. శివాజీ మొహం మీదే చెబుతూ.. వాదిస్తుంది.

ఇక మహేష్ టక్కరి దొంగ సినిమాలోని నలుగురికి నచ్చనిది పాటతో నిద్రలేచిన కంటెస్టెంట్స్ .. ఓ పక్క డ్యాన్స్ చేస్తుంటే.. ఇంకో పక్క ప్రిన్స్ యావర్.. రతికతో.. డ్యాన్స్ చేస్తూ పట్టుకోడానికి డ్యాన్స్ చేయడానికి తెగ తంటాలు పడుతుంటారు.

ఇక సందీప్ సరదా కారణంగా.. శివాజీ దృష్టిలో క్యారెక్టర్ లెస్‌గా ముద్ర పడిపోతాడు తేజు. తన పవరాస్త్రను దొంగిలించింది ఎవరు అని శివాజీ.. సందీప్‌ను అడగగా.. తెలుసు కానీ చెప్పలేను.. ప్రామిస్ చేశా అంటూ సందీప్ అన్సర్ ఇస్తాడు. అయినా పర్లేదు చెప్పు అంటే.. తేజ అంటూ.. పేరు చెబుతాడు. దీంతో శివాజీ.. తేజ పై సీరియస్ అవుతాడు. క్యారెక్టర్ లెస్ అంటూ.. అడుక్కుతిని తేజు ఈ వీక్‌ లో సేవ్‌ అయ్యాడని.. మొగోడిలా ఆడి సేవ్‌ అవ్వలేడంటూ.. నోటికొచ్చినట్టు కోపంలో విమర్శిస్తాడు శివాజీ.

ఇక శివాజీ మనసులో.. తేజు పై తప్పుడు ఇంప్రెషన్ నాటిన సందీప్.. ఇంకో పక్క తేజుకు.. మరోలా చెబుతాడు. సరదాకు.. పవరాస్త్రను తీసింది నువ్వే అంటూ.. శివాజీకి చెప్పా.. నువ్వు అదే చెప్పు అంటూ చెబుతాడు. సిగరెట్ రూం దగ్గర కూడా అమర్‌కు ఇదే విషయం చెప్పి.. శివాజీ తేజును క్యారెక్టర్‌ లెస్ అని తిడుతున్నాడంటూ నవ్వుతాడు. ఇక సందీప్ ఈసరదా గేమ్‌లో బలిపశువు అయిన తేజు.. ఈ విషయాన్ని ఎవరికి చెప్పలో అర్థంకాక.. శోభతో పంచుకుంటూ ఉంటాడు. తన ప్లాన్‌లో తను ఉన్నట్టు కటింగ్ ఇస్తాడు.

ఇక ఇంకో పక్క శివాజీ బాలయ్య సినిమాలోని మాస్‌ డైలాగులు చెబుతూ.. బీబీ ప్రేక్షకులను అటు నవ్విస్తూనే షాకయ్యేలా చేస్తుంటాడు. తేజ కుక్క తోకలాంటోడు. అది ఎప్పుడూ వంకరే అంటూ.. రైతు బిడ్డతో కలిసి.. తేజనే పోక్ చేస్తుంటాడు. ఇప్పుడు కుక్కెందుకు గుర్తుకువచ్చిందని.. తేజ అడిగితే.. కుక్కను చూస్తే కుక్కే గుర్తుకు వస్తుంది అంటూ.. ఆన్సర్ ఇస్తాడు. అయితే ఈ కన్వర్‌ జేషన్లో.. శివాజీ కంటే సందీపే బ్యాడ్ అవుడాడు. ఎందుకంటే శివాజీని మిస్ గైడ్‌ చేసింది సందీపే కాబట్టి. ఇక ఇలా సాగుతున్న బీబీ హౌస్‌లో బిగ్‌ బాస్ ఒక్కసారిగా ఓ షాకింగ్ అనౌన్స్ మెంట్ తో ముందుకొస్తారు. ఇంటి సభ్యులవ్వడానికి ఫిజికల్ అండ్ మెంటల్ ఎండ్యూరెన్స్ ముఖ్యం అంటూ.. ప్రిన్స్‌కు ఓ టాస్క్‌ ఇస్తాడు. ఇక ఈ టాస్క్‌తో.. తన కంటెండర్‌ షిప్ ను వ్యతిరేకించిన దామిని, తేజ, రతికకు కూడా ఫ్రూఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అందుకోసం.. గార్డెన్‌ ఏరియాలో ఉన్న స్టాండ్‌పై చిన్ (Chin)పెట్టాలని.. తేజ, రతిక, దామిని ఏం చేసినా.. గంట పాటు చిన్‌ను స్టాండ్‌ పై నుంచి తీయొద్దని ప్రక్రియ గురించి చెబుతాడు. శివాజీ, సందీప్ ఈ టాస్క్‌ కు సంచాలకులుగా ఉండాలని ఆదేశిస్తాడు.

ఇక టాస్క్‌ మొదలవడంతో.. ఫుల్ ఆన్‌ ఫైర్‌ మీద స్టాండ్‌ పై చిన్ పెట్టిన ప్రిన్స్‌ను.. నానారకాలుగా ఇబ్బంది పెట్టి టాస్క్‌లో విఫలమయ్యేలా చేసే ప్రయత్నంచేస్తుంటారు. రతిక ప్రిన్స్ మొఖానికి గుడ్లు కొట్టగా.. దామిని చెవిలో, ముక్కులో పుల్లలు పెడుతుంది. ఇంకో పక్క తేజ.. ప్రిన్స్‌ టీషర్ట్‌లో ఐస్ ముక్కలు వేస్తాడు. అయితే ఆ తరువాత ఛాలెంజర్స్ అయిన రతికి, తేజ, దామిని బిగ్ బాస్‌ పేడ గడ్డి లాంటివి పంపించడంతో.. టాస్క్‌ మరో లెవల్‌కు వెళుతుంది. ప్రిన్స్‌ పై రతిక, దామిని అదే పనిగా పేడ నీళ్లను జల్లుతూ.. ప్రిన్స్‌ను ఇరిటేస్తుంటారు. కానీ ఎంతో ఓపికకగా భరించిన యావర్‌ ఆ టాస్క్లో విన్నర్‌గా గెలుస్తాడు. ఆ ఆనందో.. తన ట్రేడ్ సౌండ్తో అరుస్తాడు. బిగ్ బాస్‌ తో పాటు.. కంటెస్టెంట్స్ అందర్నీ చప్పట్లు కొట్టేలా చేసుకుంటాడు.

ఇక మరో పక్క అమర్‌ దీప్ శివాజీతో ఛాలెంజ్‌కు రెడీ అవుతుంటాడు. పవరాస్త్రను తీసింది తానే అనేలా.. శివాజీకి హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. A అంటే అస్త్ర AA అంటే అమర్ దీప్.. అస్త్రను కొట్టేసింది అమర్ దీప్ అంటూ.. హింట్ ఇచ్చాననుకుంటాడు అమర్ దీప్. కానీ శివాజీ దాన్ని పిచ్చి లైట్‌ గా తీసుకుంటాడు. అమర్ దీప్ ఒకటి అనుకుంటే.. ఇంకోటి అవడంతో కాస్త షాకవుతాడు.

ఇక కట్ చేస్తే.. ఎప్పుడూ బెడ్ పై నడుము వాల్చే తేజకు.. టాస్క్‌ ఇస్తాడు బిగ్ బాస్. డే టైంలో.. బెడ్‌ పై అసలు నడుము వాల్చొద్దంటూ.. చెబుతాడు. తేజ అలా చేయకుండా చూసే బాధ్యత అమర్‌ దీప్‌కిస్తాడు.

ఇక ప్రిన్స్ తరువాత శోభ, అమర్‌ దీప్ లలో.. శోభ కంటెండర్స్‌ అవడం ఇష్టం లేదని చెప్పిన కంటెస్టెంట్స్‌ ను .. వారి రీజన్స్‌ ను చూపించిన బిగ్ బాస్ .. నెక్ట్స్ టాస్క్ శోభ వంతు అనేలా హింట్ ఇస్తాడు. కానీ గౌతమ్, సుబ్బు, రైతు బిడ్డ చెప్పిన రీజన్స్‌ నచ్చని శోభ.. వారితో.. అందులోనూ.. గౌతమ్‌తో పెద్ద గొడవకే దిగుతుంది. అయితే ఈ గొడవలో హైలెట్ ఏంటంటే.. శోభ వాదిస్తూ.. మధ్యలో షర్ట్ విప్పిన గౌతమ్‌..పుల్ రాజా పుల్ గేమ్లో తనుకు దెబ్బతగిలింది అంటూ.. వాదిస్తాడు. ఈ వాదనలో పదే పదే తను కష్టపడి జిమ్ చేసుకున్నా అంటూ.. షర్ట్ విప్పి చూసిస్తాడు. వెయిట్స్ ఎత్తుతూ.. ‘నా బాడీ నా ఇష్టం’ అంటూ.. అరుస్తాడు. దీంతో ‘నీ కన్నా ఎక్కువ డేస్‌ ఈ హౌస్‌లో ఉండి.. నీకంటే నేనే డిసర్వ్‌ అని నిరూపిస్తా’ అంటూ.. శోభ ఛాలెంజ్ చేస్తుంది. అయితే ఈ వాదనలో.. ఎందుకో గౌతమ్‌ ఎర్రిపప్ప అయిన ఫీలింగ్ కలుగుతుంది సరిగ్గా చూసే వాళ్లకు. దాంతో పాటే.. నాగార్జున చేతిలో ఈ వారం గౌతమ్‌కు ఉంటందనే ఫీలింగ్ అందరికీ కలుగుతుంది.

ప్రిన్స్, శోభ, తరువాత అమర్‌దీప్‌ని ఒక్క ప్రియాంకనే అన్‌వర్తీ అనే చెప్పడంతో.. షాక్‌లోకి వెళ్లిపోతాడు అమర్‌. షాక్‌ లో హౌస్‌ నుంచి లాన్‌లో ఉన్న సోఫాకి వెళిపోతాడు. ఇక తన వెనకే ప్రియాంక వెళ్లగా.. తేజ కామెడీ చేస్తుంటాడు. రాముడు జానకిని అనుమానించింది కానీ.. జానకి రాముడిని ఎప్పుడూ అనుమానించలేదని..కామెడీ చేస్తుంటాడు. అయితే కాస్త ఫీలైన అమర్ ప్రియాంక ఇచ్చిన ఎక్స్‌ప్లానేషన్‌తో.. సాటిఫై అయి.. గెలిచి చూపెడదాం లే అంటూ.. చేతులు కలుపుతాడు. గొడవే లేకుండా.. సైలెంట్‌గా ఉంటాడు.

                                                                                       – సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.